Viran Muttamsetty: హీరోగా అల్లు అర్జున్ కజిన్ ఎంట్రీ.. ఇంట్రెస్టింగ్‌గా టైటిల్ పోస్టర్

Gilt Movie Title Poster: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి గిల్ట్ మూవీతో హీరోగా మారనున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. త్వరలోనే నటీనటుల వివరాలను వెల్లడించనుండగా.. టైటిల్ పోస్టర్‌తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 7, 2024, 10:33 PM IST
Viran Muttamsetty: హీరోగా అల్లు అర్జున్ కజిన్ ఎంట్రీ.. ఇంట్రెస్టింగ్‌గా టైటిల్ పోస్టర్

Gilt Movie Title Poster: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే పలు పాత్రలతో ఆడియన్స్‌ను మెప్పించిన విరాన్.. ఇప్పుడు హీరోగా మారనున్నాడు. ఇటీవల పురుషోత్తముడు సినిమాలో అలరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం డిఫరెంట్ కంటెంట్ సినిమాలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. కమర్షియల్ మూవీస్ కంటే.. కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలు బాక్సాఫీసు వద్ద వసూళ్లు రాబడుతున్నాయి. ఈ క్రమంలోనే విరాన్ కూడా కంటెంట్ బేస్‌డ్ కథను ఎంచుకున్నాడు.

Also Read: Anant Ambani: కొత్త జంట అనంత్ అంబానీ, రాధిక.. గణేశుడికి 20 కిలోల బంగారు కిరీటం కానుక

యూత్‌ఫుల్ లవ్ స్టోరీతోపాటు క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్‌గా మేకర్స్ తెరకెక్కించనున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు గిల్ట్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్ పోస్టర్‌నే ఇంట్రెస్టింగ్‌గా డిజైన్ చేశారు. ప్రస్తుతానికి టైటిల్ పోస్టర్ మాత్రమే విడుదల చేశారు. నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తెరకెక్కించనున్నారు. శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ బ్యానర్‌పై లక్ష్మీ సునీల, డా.పార్థసారథి రెడ్డి, ఎ.శివ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చలపతి పువ్వల దర్శకత్వం వహిస్తుండగా.. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా పి.శ్రీనివాస్, డీ.శ్రీనివాస్ (వాసు) వ్యవహరిస్తున్నారు.

సాంకేతిక వర్గం

==> బ్యానర్ : శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్
==> ప్రొడ్యూసర్స్: డా. పార్థసారథి రెడ్డి, లక్ష్మీ సునీల, ఎ. శివ కుమార్
==> ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి.శ్రీనివాస్, డి.శ్రీనివాస్ (వాసు )
==> డైరెక్టర్: చలపతి పువ్వల
==> ఎడిటర్: ఎస్ బి ఉద్ధవ్ 
==>  మ్యూజిక్ డైరెక్టర్: మహావీర్
==> ఫైట్స్: నందు మాస్టర్
==> రైటర్ : జి. రామకృష్ణ 
==> కెమెరామెన్ : కిషోర్ బోయిడపు
==> PRO : సాయి సతీష్

Also Read: AP Floods Damage: ఆంధ్రప్రదేశ్‌కు కోలుకోలేని దెబ్బ.. వరదలతో రూ.6,880 కోట్ల నష్టం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News