Kajal Aggarwal Marriage: కాజల్‌కు కాబోయే భర్త ఎంత ధనవంతుడో తెలుసా?

Gautam Kitchlu Facts : టాలీవుడ్ ( Tollywood ) చందమామ కాజల్ అగర్వాల్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కనుంది. అక్టోబర్ 30వ తేదీన ముంబైలో తన ప్రియుడు గౌతమ్ కిచ్లును వివాహాం చేసుకోనుంది ఈ అమ్మడు. 

Last Updated : Oct 8, 2020, 01:32 PM IST
    • టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కనుంది.
    • అక్టోబర్ 30వ తేదీన ముంబైలో తన ప్రియుడు గౌతమ్ కిచ్లును వివాహాం చేసుకోనుంది ఈ అమ్మడు.
    • ఈ విషయం తెలిసినప్పటి నుంచి కాజల్ అభిమానులు గౌతమ్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
Kajal Aggarwal Marriage: కాజల్‌కు కాబోయే భర్త ఎంత ధనవంతుడో తెలుసా?

టాలీవుడ్ ( Tollywood ) చందమామ కాజల్ అగర్వాల్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కనుంది. అక్టోబర్ 30వ తేదీన ముంబైలో తన ప్రియుడు గౌతమ్ కిచ్లును వివాహాం చేసుకోనుంది ఈ అమ్మడు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి కాజల్ అభిమానులు గౌతమ్ ( Gautam Kitchlu ) గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

ALSO READ| Rajinikanth to PSPK:  మీ ఫేవరిట్ హీరోల అసలు పేర్లేంటో తెలుసా ?

గౌతమ్ కిచ్లు ఏం చేస్తాడు.. ఎంత సంపాదిస్తాడు వంటి అంశాలు గూగుల్ చేస్తున్నారు. పైగా పలు ప్రసార మాధ్యమాల్లో వారి గురించి ఎన్నో రకాల స్టోరీస్ రావడం వల్ల పాఠకులు ఏది నిజమో అర్థం చేసుకోలేకపోతున్నారు. వారి కోసం ఒకటికి రెండు సార్లు చెక్ చేసి అందిస్తున్న అంశాలు ఇవే...

గౌతమ్ కిచ్లు గురించి ఆసక్తికరమైన అంశాలు..( Interesting Facts About Gautam Kitchlu )

1) గౌతమ్- కాజల్ మధ్య ప్రేమ కథ ఈ నాటిది కాదు. సుమారు ఏడెనిమిది సంవత్సరాల నుంచి వారి ప్రేమకథ ప్రపంచానికి తెలియకుండా సాగుతోంది. దీనికి ప్రస్తుతం సోషల్ మీడియాలో ( Social Media ) వైరల్ అవుతున్న ఫోటోలే సాక్ష్యం.

2 ) పలు పార్టీల్లో కాజల్ (Kajal Aggarwal ), గౌతమ్ ఇద్దరూ చాలా దగ్గరిగా కనిపించారు.

3 ) గౌతమ్ కిచ్లుతో పరిచయం స్నేహంగా మారి, ఆ తరువాత ప్రేమగా మారింది అని తెలుస్తోంది. అంతే కానీ చాలా మంది అనుకుంటున్నట్టు కాజల్ పెళ్లికి సిద్ధం అయిన తరువాత కిచ్లుతో పరిచయం కాలేదు.

4 ) ఇక గౌతమ్ డిసెర్న్ లివింగ్ అనే కంపెనీకి సీఈవో. ఈ సంస్థ ఇంటీరియర్ డిజైనింగ్ ప్రాజెక్టులు చేస్తుంది. తమ పోర్టల్ ద్వారా ఆర్డర్లు స్వీకరించి పూర్తి చేస్తుంది. ఈ సంస్థను గౌతమ్ ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభించాడు.

5 ) గత కొన్ని సంవత్సరాల్లో గౌతమ్ ( Gautam Kitchlu ) పలు వ్యాపారాలు కూడా చేసినట్టు తెలుస్తోంది. అతని సోషల్ మీడియా ఖాతాలో ఎక్కువగా ఇంటీరియర్ డిజైనింగ్ ఫోటోలు కనిపిస్తాయి. 

ALSO READ|  Pan India: ప్యాన్ ఇండియాపై ఫోకస్ పెట్టిన తెలుగు స్టార్స్, దర్శకనిర్మాతలు

6)  వ్యాపారంతో పాటు గౌతమ్ కిచ్లుకు క్రీడలంటే చాలా ఇష్టమట. స్వయంగా మంచి అథ్లెట్ కూడా. మారాథాన్ పరుగుల్లో పాల్గొన్నాడు.

7)  ఇక గౌతమ్ సంపద గురించి మాట్లాడితే.. మొత్తంగా అతను రూ.50 కోట్ల అస్తిపరుడు అని తెలుస్తోంది.

8) అక్టోబర్ 30న జరగబోయే కాజల్- గౌతమ్ వివాహానికి అది కొద్ది మందిని మాత్రమే ఆహ్వానించనున్నారట. కరోనావైరస్ ( Coronavirus ) మహహ్మారి వల్ల ఇలా చేయాల్సి వస్తుంది అని.. అందరూ తమ కొత్త జీవితం సంతోషంగా ఉండేలా ఆశీర్వదించాలని కోరారు కాజల్.
( గమనిక:  ఈ స్టోరీని వివిధ ప్రచార మాధ్యమాలు / ప్రసార మాధ్యమాలు/  సెలబ్రిటీల వ్యక్తిగత సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అందించాం. గమనించగలరు. )

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

Trending News