Bigg Boss Telugu 4: దివి ఎలిమినేషన్.. ప్లాన్ ప్రకారం జరిగిందా?

Divi Eliminated From Bigg Boss Telugu 4 | ఆదివారం రాత్రి బిగ్‌బాస్ తెలుగు 4 నుంచి ఏడో వారం కంటెస్టెంట్ దివి ఎలిమినేట్ అయ్యారు. ప్రేక్షకులు బిగ్‌బాస్ మైండ్ గేమ్‌తో పాటు మొనాల్ గజ్జర్‌ను సేవ్ చేసుందుకు చేసిన ట్రిక్స్‌ను పసిగట్టేశారు. బిగ్‌బాస్ చాలా బాగా సేఫ్ గేమ్ ఆడేశాడని టాక్ వినిపిస్తోంది.

Last Updated : Oct 26, 2020, 02:01 PM IST
Bigg Boss Telugu 4: దివి ఎలిమినేషన్.. ప్లాన్ ప్రకారం జరిగిందా?

Divi Elimination From Bigg Boss Telugu | రియాలిటి షో బిగ్‌బాస్ తెలుగు 4 విజయవంతంగా కొనసాగుతోంది. అయితే వివాదాలు, వివాదాస్పద ఎలిమినేషన్స్‌తో రేటింగ్, ఓటింగ్ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఆదివారం విజయదశమి పండుగను పురస్కరించుకుని పెద్ద ఎపిసోడ్ ప్లాన్ చేశారు బిగ్‌బాస్ నిర్వాహకులు. బిగ్‌బాస్ తెలుగు 4 (Bigg Boss Telugu 4) హోస్ట్ నాగార్జున అక్కినేని ‘వైల్డ్ డాగ్’ షూటింగ్‌తో బిజీగా ఉండగా గెస్ట్ హోస్ట్‌గా సమంత వ్యవహరించి మెప్పించారు. ఆదివారం రాత్రి బిగ్‌బాస్ తెలుగు 4 నుంచి ఏడో వారం కంటెస్టెంట్ దివి ఎలిమినేట్ (Divi Eliminated From Bigg Boss Telugu 4) అయ్యారు.

 

అయితే కంటెస్టెంట్ దివి ఎలిమినేషన్ ప్రక్రియను ప్లాన్ ప్రకారం నిర్వహించారని తెలుస్తోంది. బిగ్‌బాస్ తెలుగు 4 ప్రేక్షకులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆరో వారం కుమార్ సాయి, మొనాల్ గజ్జర్ మిగలగా ... వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ కుమార్ సాయి ఎలిమినేట్ అని ప్రకటించారు. అప్పటివరకూ మొనాల్ ఎలిమినేట్ అవుతుందని బిగ్‌బాస్ 4 సభ్యులతో పాటు ఓట్లు వేసిన నెటిజన్లు, ప్రేక్షకులు భావించారు. మొనాల్‌ను కావాలని బిగ్‌బాస్ తెలుగు 4 నిర్వాహకులు ఎలిమినేషన్ నుంచి సేవ్ చేశారంటూ నెటిజన్లు గగ్గోలు పెట్టారు. దీంతో ఏడో వారం బిగ్‌బాస్ తెలుగు 4లో నిర్వాహకులు తమ వ్యూహాన్ని మార్చారు.

ఎలిమినేసన్ నుంచి సేవ్ అయ్యే చివరి ఇద్దరు సభ్యులలో మొనాల్ గజ్జర్ ఉండకుండా ప్లాన్ చేశారని బిగ్‌బాస్ 3 ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అలా చేస్తే ఈవారం సైతం మొనాల్‌కు ఓట్లు రాకున్నా బిగ్‌బాస్ తెలుగు 4 నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగానే ఆమెను సేవ్ చేశారన్న మాట రాకుండా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏడో వారం ఎలిమినేషన్ నుంచి మొనాల్‌ను త్వరగానే సేవ్ చేశారు. ఆపై కంటెస్టెంట్స్ అభిజిత్, నోయల్‌లను సేవ్ చేసినట్లు ప్రకటించారు.

 

చివరగా, స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కమెడియన్ అవినాష్, నటి దివి మిగిలేలా బిగ్‌బాస్ 4 తెలుగు మేనేజ్‌మెంట్ ప్లాన్ చేసింది. ఆ సందర్భంలో.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినప్పటికీ అవినాష్‌తో పోల్చితే దివికి కాస్త తక్కువ ఓట్లు వచ్చి ఉంటాయని బిగ్‌బాస్ తెలుగు 4 ప్రేక్షకులు భావించాలని మైండ్ గేమ్ ఆడారు. కానీ ప్రతిరోజూ గేమ్‌ను చూడటంతో పాటు దీనిపై చర్చించుకునే ప్రేక్షకులు బిగ్‌బాస్ మైండ్ గేమ్‌తో పాటు మొనాల్ గజ్జర్‌ను సేవ్ చేసుందుకు చేసిన ట్రిక్స్‌ను పసిగట్టేశారు. ప్లాన్ ప్రకారం దివి, అవినాష్ చివరి పేర్లుగా చూపించారు. అవినాష్‌ సేవ్ అని ప్రకటించి, దివి ఎలిమినేట్ అయ్యారని గెస్ట్ హోస్ట్ సమంత ప్రకటించగానే బిగ్‌బాస్ చాలా బాగా సేఫ్ గేమ్ ఆడేశాడని టాక్ వినిపిస్తోంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Trending News