Jagapathi Babu bollywood entry: జగపతి బాబు బాలీవుడ్ ఎంట్రీకి రెడీ !

Jagapathi Babu bollywood entry as villain: తాజాగా వినిపిస్తున్న టాక్ ఏంటంటే.. జగపతి బాబుకు మరోసారి బాలీవుడ్‌లో విలన్ పాత్ర (Jagapathi Babu as villain in Bollywood)  పోషించే అవకాశం వచ్చిందని, ఈసారి మన జగ్గూ భాయ్ కూడా ఓకే చెప్పాడని ఫిలింనగర్ టాక్.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 21, 2021, 07:04 AM IST
  • జగపతి బాబుకు మరోసారి బాలీవుడ్ నుంచి విలన్ రోల్ ఆఫర్
  • ఫరాన్ అఖ్తర్ సినిమాకు జగ్గూ భాయ్ ఓకే చెప్పినట్టు ప్రచారం
  • హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్‌ని ఎంపిక చేసుకునే ఛాన్స్
Jagapathi Babu bollywood entry: జగపతి బాబు బాలీవుడ్ ఎంట్రీకి రెడీ !

Jagapathi Babu bollywood entry as villain: జగపతి బాబు బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్నాడా అంటే అవుననే తెలుస్తోంది. జగపతి బాబు లెజెండ్ సినిమాతో విలన్ పాత్రలతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాకా తెలుగుతో పాటు దక్షిణాదిన తమిళ, మళయాళం చిత్రాల్లోనూ విలన్‌గా చేసి మెప్పించాడు. దీంతో ఎప్పటి నుంచో జగపతి బాబుకు బాలీవుడ్‌లోనూ విలన్ పాత్రలు చేసేందుకు అవకాశాలు తలుపు తడుతున్నాయని తెలుస్తోంది. అయితే బాలీవుడ్‌లో సినిమాలు చేయడంపై అంతగా ఆసక్తి లేని జగపతి బాబు ఆ అవకాశాలకు నో చెబుతూ వచ్చాడట.

అయితే, తాజాగా వినిపిస్తున్న టాక్ ఏంటంటే.. జగపతి బాబుకు మరోసారి బాలీవుడ్‌లో విలన్ పాత్ర (Jagapathi Babu as villain in Bollywood)  పోషించే అవకాశం వచ్చిందని, ఈసారి మన జగ్గూ భాయ్ కూడా ఓకే చెప్పాడని ఫిలింనగర్ టాక్. 

బాలీవుడ్‌లో అమీర్ ఖాన్‌తో లగాన్, షారుఖ్ ఖాన్‌తో స్వదేశ్ (Shah Rukh Khan), హృతిక్ రోషన్‌తో జోదా అక్బర్, మొహెంజో దారో వంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన అశుతోష్ గోవరికర్ దర్శకత్వంలో ఫరాన్ అఖ్తర్ హీరోగా రాబోతున్న పుకార్ అనే సినిమాలో విలన్ పాత్ర చేయాల్సిందిగా బాలీవుడ్ నుంచి పలువురు జగపతి బాబును సంప్రదించారట.

Also read : Varudu Kavalenu trailer: వరుడు కావలెను ట్రైలర్ లాంచ్ చేయనున్న రానా

ఇప్పటి వరకు నో చెబుతూ వచ్చిన జగపతి బాబు ఈసారి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో వారికి ఓకె చెప్పినట్టు సమాచారం. అదే కానీ నిజమైతే.. జగ్గూ భాయ్‌ని (Jagapathi Babu) ఇక బాలీవుడ్ విలన్‌గానూ చూడవచ్చన్న మాట.

అన్నట్టు  ఈ సినిమాకు టాలీవుడ్‌కి ఉన్న మరో కనెక్షన్ ఏంటంటే... పుకార్ సినిమాలో ఫరాన్ అఖ్తర్ సరసన టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్‌ని హీరోయిన్‌గా తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ రకుల్ ప్రీత్ సింగ్‌కి (Actress Rakul Preet Singh) ఈ సినిమాలో ఛాన్స్ వస్తే.. పుకార్ సెట్స్‌లో జగపతి బాబుకు మంచి కంపెనీ లభించినట్టే.

Also read : Kareena Kapoor in Prabhas Film: ప్రభాస్‌ స్పిరిట్‌ మూవీలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ విలనిజం!

Also read : Samantha Defamation suit on Youtuba channels: కోర్టును ఆశ్రయించిన సమంత..యూట్యూబ్ ఛానెళ్లపై పరువు నష్టం దావా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook                                                                                                                                                                                                                                                                                    

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x