James Cameron RRR : ఆర్ఆర్ఆర్‌పై జేమ్స్ కామెరూన్ రివ్యూ.. దెబ్బకు ఫిదా అయిన రాజమౌలి.. వీడియో వైరల్

James Cameron RRR Movie Review జేమ్స్ కెమరూన్‌తో దర్శక ధీరుడు రాజమౌళి పెట్టిన ముచ్చట్లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. తాజాగా ఆ వీడియోకు సంబంధించిన పూర్తి వీడియోను షేర్ చేశారు. ఆర్ఆర్ఆర్ ట్విట్టర్‌ హ్యాండిల్‌ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 21, 2023, 12:53 PM IST
  • జేమ్స్ కెమరూన్‌తో రాజమౌళి ముచ్చట్లు
  • ఆర్ఆర్ఆర్ రివ్యూ చెప్పిన జేమ్స్ కెమరూన్
  • మ్యూజిక్, కథ, కథనాలపై ఇంటర్నేషనల్ డైరెక్టర్
James Cameron RRR : ఆర్ఆర్ఆర్‌పై జేమ్స్ కామెరూన్ రివ్యూ.. దెబ్బకు ఫిదా అయిన రాజమౌలి.. వీడియో వైరల్

James Cameron RRR Movie Review దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. నాటు నాటు సాంగ్‌కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం, రాజమౌళికి క్రిటిక్స్ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్, న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ నుంచి బెస్ట్ డైరెక్టర్ అవార్డు రావడంతో ప్రపంచమంతా కూడా ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడుకుంటోంది. ఇప్పుడు జేమ్స్ కెమరూన్‌తో రాజమౌళి పెట్టిన ముచ్చట్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

జేమ్స్ కెమరూన్ మన ఆర్ఆర్ఆర్ సినిమాను పొగడటం, రాజమౌళి తెరకెక్కించిన తీరుని గురించి వర్ణించడం అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన వీడియో గత వారమే బయటకు వచ్చింది. కానీ అందులో ఈ ఇద్దరూ మాట్లాడుకున్న మాటలు అంత క్లియర్‌గా వినిపించలేదు. ఇప్పుడు పూర్తి వీడియోను ఆర్ఆర్ఆర్ టీం షేర్ చేసింది.

 

అందులో జేమ్స్ కెమరూన్‌ ఇలా అన్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఎంతో గొప్పగా చెప్పాడు. ఒక్కో సీన్ ఎలా తీశాడో చెబుతూ రాజమౌళిని పొగిడేశాడు. కథ ముందుకు వెనక్కి వెళ్లడం, మళ్లీ ఫ్లాష్ బ్యాక్‌లోకి రావడం, వాటర్, ఫైర్ ఇలా అన్నింటిని ఎంతో బాగా చూపించావ్ అంటూ ఇలా జేమ్స్ కామెరూన్ పొగిడేశాడు. ఇలా ఆయన చెబుతూ ఉంటే.. రాజమౌళి చిన్న పిల్లాడిలా మారిపోయాడు. మీ నుంచి ఇలాంటి మాటలు రావడంతో అది అవార్డ్ కంటే ఎంతో పెద్దది అని చెప్పుకొచ్చాడు.

ఇక ఇంతలో జేమ్స్ కెమరూన్ భార్య మధ్యలోకి వచ్చి.. ఆయన రెండు సార్లు సినిమాను చూశాడు. ఫస్ట్ ఆయన చూశాడు. ఆ తరువాత నాకు చూపించాడు.. సినిమా అద్భుతంగా ఉంది.. చూడాల్సిందే.. చూడు అని తీసుకెళ్లాడు. ఇక సినిమా చూస్తుంటే.. స్పాయిల్ చేస్తాడేమో అనుకున్నా. కానీ సైలెంట్‌గా చూస్తూనే ఉన్నాడు అంటూ జేమ్స్ కెమరూన్ భార్య చెప్పేసింది.

నేను స్పాయిల్ చేయాలని అనుకోలేదు.. అని జేమ్స్ కెమరూన్ అనేశాడు. ఇక కీరవాణి గురించి రాజమౌళి చెప్పగా.. మ్యూజిక్ అద్భుతంగా ఉందని, సినిమాలో తదుపరి వచ్చే సీన్‌ను ముందే చెప్పేలా అద్భుతంగా మ్యూజిక్ ఉందని పొగిడేశాడు.

Also Read:  Pathaan Advance Booking : పఠాన్ మేనియా.. ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే.. కింగ్ ఖాన్ కమ్ బ్యాక్ ఇచ్చినట్టేనా?

Also Read: Mahesh Babu Son : గౌతమ్ మొదటి సారి ఆ పని చేయబోతోన్నాడు.. నమ్రత పోస్ట్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News