HBD Janhvi Kapoor : అదిరిపోయిన పోస్టర్.. ఎన్టీఆర్‌కు జోడిగా జాన్వీ కపూర్

HBD Janhvi Kapoor జాన్వీ కపూర్ బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఇన్నాళ్లు ఎన్టీఆర్ ముప్పవ సినిమాకు సంబంధించిన హీరోయిన్ మీద అప్డేట్లు రాలేదు. జాన్వీ కపూర్‌ను తీసుకుంటారనే టాక్ మాత్రమే వచ్చింది. నేడు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 6, 2023, 12:22 PM IST
  • ఎట్టకేలకు ఎన్టీఆర్ 30 అప్డేట్
  • జాన్వీ కపూర్ బర్త్ డే స్పెషల్ పోస్టర్
  • ఎన్టీఆర్‌కు జోడిగా జాన్వీ కపూర్
HBD Janhvi Kapoor : అదిరిపోయిన పోస్టర్.. ఎన్టీఆర్‌కు జోడిగా జాన్వీ కపూర్

NTR 30 Movie Heroine Poster ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో రాబోతోన్న సినిమాకు సంబంధించిన హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ ఫిక్స్ అయింది. నేడు ఆమె బర్త్ డే. ఈ సందర్భంగా ఎన్టీఆర్ 30 నుంచి ఆమె పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. దీంతో అధికారికంగా ఎన్టీఆర్ హీరోయిన్‌ను ప్రకటించినట్టు అయింది. లంగావోణిలో జాన్వీ కపూర్ ఈ పోస్టర్‌లో ఎంతో అద్భుతంగా కనిపిస్తోంది. చూస్తుంటే ఆమె కెరీర్‌లో ఇదే మొదటి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలా ఉంది.

జాన్వీ కపూర్‌ తెలుగులోకి ఎప్పుడో ఎంట్రీ ఇవ్వాల్సింది. కానీ ఆమె కావాలనే తెలుగు సినిమాలను అవాయిడ్ చేస్తూ వస్తోంది. తెలుగు దర్శక నిర్మాతలు జాన్వీ కావాలని ఎన్నో సినిమాలకు అడిగారు. కానీ ఆమె మాత్రం కేవలం బాలీవుడ్ సినిమాలు చేస్తాను అన్నట్టుగా బిల్డప్ ఇచ్చిందని సమాచారం. అయితే అక్కడ ఆమె నటించిన ఏ ఒక్క సినిమా కూడా హిట్ అవ్వడం లేదు. ఐరన్ లెగ్‌గా జాన్వీ కపూర్‌కు బాలీవుడ్‌లో ముద్ర పడింది.

జాన్వీ కపూర్‌కు సరైన హిట్ కావాలంటే అది టాలీవుడ్ మాత్రమే ఇవ్వగలదని అర్థం చేసుకున్నట్టుగా ఉంది. అందుకే ఇప్పుడు ఎన్టీఆర్‌తో జోడి కట్టేందుకు జాన్వీ ఒప్పుకుంది. దీంతో టాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్ అయింది. ఇక ఈ సినిమాతోనైనా ఆమె దశ తిరుగుతుందో లేదో చూడాలి. జాన్వీ కపూర్ తన బర్త్ డే సందర్భంగా ఇలా అధికారికంగా టాలీవుడ్ డెబ్యూ గురించి చెప్పేసింది.

 

మామూలుగా అయితే జాన్వీ కపూర్ రామ్ చరణ్ కలిసి నటిస్తారని అంతా అనుకున్నారు.. విజయ్ దేవరకొండ లైగర్ సినిమాకు కూడా జాన్వీని తీసుకోవాలని ప్రయత్నించారట. ఇంకొన్ని సినిమాలకు జాన్వీ కపూర్‌ను సంప్రదించారట. కానీ వాటికి జాన్వీ కపూర్ నో చెప్పేసిందట. ఇప్పుడు ఇలా కొరటాల శివ ఎన్టీఆర్ సినిమాకు జాన్వీ ఓకే చెప్పేసి మంచి నిర్ణయమే తీసుకుంది.

ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు ఆకాశన్నంటుతాయి. దానికి తగ్గట్టే కొరటాల శివ సైతం మంచి కథను ప్రిపేర్ చేశాడు. ఈ స్క్రిప్ట్ బాగా రావాలనే ఉద్దేశంతోనే ఇంత గ్యాప్ తీసుకుంటున్నాడు. ఇక ఈ నెలలోనే ఈ మూవీ షూటింగ్ సెట్స్ మీదకు వెళ్లనుంది.

Also Read:  Manchu Manoj Marraige : ఏ జన్మ పుణ్యమో నాది.. మంచు మనోజ్ ఎమోషనల్

Also Read: Shruti Hassan Knee Injury : శ్రుతి హాసన్ మోకాళ్లకు గాయం.. నెటిజన్ల సెటైర్లు.. అసలు మ్యాటర్ ఏంటంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News