Devara: దేవరా కథ ఇదేనా..? ఆ పాత్ర సినిమాలో కీలకం..!

Saif Ali Khan in Devara: ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి.. రాబోతున్న చిత్రం దేవర. అందుకే ఈ మూవీ ఎన్టీఆర్ అభిమానులకు ఏంతో ప్రత్యేకం. పైగా ఈ మూవీకి.. దర్శకత్వ బాధ్యతలు కొరటాల శివ నిర్వహించడంతో.. చిత్రంపై అంచనాలు భారీగా నెలకొని ఉన్నాయి. ఇక ఇందులో సైఫ్ అలీ ఖాన్.. పాత్ర గురించి ఓ చిన్ని అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Aug 13, 2024, 11:37 AM IST
Devara: దేవరా కథ ఇదేనా..? ఆ పాత్ర సినిమాలో కీలకం..!

Devara Update: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి.. సిద్ధమవుతున్న చిత్రం దేవర. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలకు.. సిద్ధమవుతున్న ఈ మూవీ ఎన్టీఆర్ అభిమానులకు ఎంత ప్రత్యేకమో చెప్పనవసరం లేదు. ఇందులో ప్రతి నాయకుడి పాత్రలో.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించిన విషయం తెలిసిందే . రీసెంట్ గా..సైఫ్ పాత్ర గురించి ఓ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

ఎన్టీఆర్ చిత్రాలలో నాయకుడి పాత్రకు.. ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రతి నాయకుడి పాత్రకు అంత ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఈసారి చాలా స్ట్రాంగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం.. సైఫ్ అలీ ఖాన్ ను ప్రతి నాయకుడిగా ఎంచుకున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన సైఫ్ అలీ ఖాన్ లుక్.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కాగా ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ పాత్ర ఎంతో ప్రత్యేకమైనదని.. అతనికి దేవర పాత్రకి ఓ ఎమోషనల్ కనెక్షన్ కూడా ఉంటుందని ఫిలింనగర్ లో టాక్. అంతేకాదు.. వీరిద్దరూ ఈ సినిమాలో అన్నా తమ్ముళ్ల లాగా కనిపించనున్నారు అని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి.ఈ మూవీలో సైఫ్ భైర అనే పాత్రలో నటిస్తున్నారు. చూడబోతే కాలభైరవుడంతా.. పవర్ ఫుల్ గా ఈ పాత్రని చూపించేలా ఉన్నారు.

ఇక సైఫ్ అలీ ఖాన్ పాత్ర.. అత్యంత క్రూరంగా కనిపించే ఒక ఇంట్రో గ్లింప్స్‌ను.. సైఫ్ పుట్టినరోజు కానుకగా చిత్ర బృందం విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అని సమాచారం. .

ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత.. ఎన్టీఆర్ మార్కెట్ టాలీవుడ్ రేంజ్ ని దాటి గ్లోబల్ రేంజ్ కి..చేరుకుంది. పైగా ఇప్పుడు ఎన్టీఆర్ బాలీవుడ్ రంగ ప్రవేశం.. కూడా చేయబోతున్నాడు. ఇక ఎన్టీఆర్ నటిస్తున్న దేవర చిత్రానికి సౌత్ తో పాటు నార్త్ లో.. కూడా కలెక్షన్స్ బాగా రావాలి అంటే హిందీ బెల్ట్ ను ఆకట్టుకునే ప్రమోషన్స్ తప్పకుండా చేయాలి. అందుకే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ద్వారా.. హిందీలో దేవర చిత్రానికి హైట్ పెంచడానికి చిత్ర బృందం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.  ఇందులో భాగంగా ఆగస్టు 15 సైఫ్ అలీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా.. చిత్ర బృందం సినిమాలో ఆయన పాత్రకు సంబంధించిన  ప్రత్యేకమైన అప్డేట్ను విడుదల చేయబోతున్నారు. 

ఇక షూటింగ్ చివరి దశలో ఉన్న దేవర మూవీలో ఆయుధ పూజ సాంగ్ చిత్రీకరణ..జరుగుతోంది. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలకు ముస్తాబవుతోంది.

Also Read: KTR vs Rahul Gandhi: సుంకిశాలపై మాటల యుద్ధం.. రాహుల్‌ గాంధీని లాగిన కేటీఆర్‌

Also Read: Chandrababu: ప్రతి రెండో శనివారం తెలంగాణకు టైమ్‌ ఇస్తా: చంద్రబాబు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News