NTR - Chandra Babu Naidu: ఒక వైపు రెండు తెలుగు రాష్ట్రాలు ప్రకృతి విపత్తు వల్ల అల్లకల్లోలం అయిపోయాయి. వరదల కారణంగా రెండు రాష్ట్రాల్లో.. చాలా వరకు పట్టణాలు జలదిగ్బంధనం అయిపోయాయి. చాలామంది నిరాశ్రయులు అయ్యారు. తిండి కూడా దొరకక చాలా మంది సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. మున్నేరు వాగు వల్ల ఖమ్మం, బుడమేరు వాగు వల్ల విజయవాడ పట్టణాన్ని.. ముంచెత్తడంతో సగం నీటిలోనే మునిగిపోయాయి.
ఈ క్రమంలో..రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి.. సహాయక కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కాగా..బాధితుల కోసం ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీ నుండి చాలామంది సెలబ్రిటీలు ముఖ్యమంత్రి నిధులకు.. విరాళాలు ప్రకటించారు. చాలామంది సెలబ్రిటీలు తమకు తోచినంత మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు.
అయితే అందులో అందరికంటే ముందుగా.. రియాక్ట్ అయిన సెలబ్రిటీ జూనియర్ ఎన్టీఆర్. రెండు తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు యంగ్ టైగర్. వరదల నుండి రెండు తెలుగు రాష్ట్రాలు త్వరగా కోలుకోవాలి అని.. ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు అండగా ఉండాలన్న ఉద్దేశంతో..తన విరాళాన్ని ప్రకటించానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
తాజా సమాచారం ప్రకారం త్వరలోనే తారక్ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి విరాళాలకు.. సంబంధించిన చెక్ లను అందజేయనున్నట్టు సమాచారం. రేవంత్ రెడ్డిని కలవడం కన్నా.. ఎన్టీఆర్ చంద్రబాబును కలవబోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతేడాది చంద్రబాబును జైల్లో పెట్టిన సమయంలో కూడా తారక్ స్పందించలేదు. మౌనంగానే ఉన్నారు.
ఆఖరికి ఎన్నికల తర్వాత ఘన విజయం సాధించిన టిడిపి గురించి ఎన్టీఆర్ కేవలం ఒకే ఒక్క ట్వీట్ వేశారు. దానికి చంద్రబాబు నాయుడు కూడా రిప్లై ఇచ్చారు. ఏదేమైనా ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ చంద్రబాబుని కలవబోతున్నారు ఎన్టీఆర్. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య మీటింగ్ ఎలా ఉంటుంది.. అని ఆసక్తిగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కాగా ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.