'RRR' Movie: సెట్‌లో రామ్ చరణ్‌ అసహనం, వీడియో షేర్‌ చేసిన తారక్‌

'ఆర్​ఆర్​ఆర్' ఆఖరి షెడ్యూల్​ షూటింగ్​ ఉక్రెయిన్​లో శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా ఓ సరదా వీడియోను షేర్​ చేశాడు తారక్. రామ్‌చరణ్‌ కొంత అసహనానికి గురైనట్లు ఇందులో చూడవచ్చు.

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 9, 2021, 06:42 PM IST
  • ఉక్రెయిన్​లో శరవేగంగా 'ఆర్​ఆర్​ఆర్' మూవీ షూటింగ్
  • ఆర్‌ఆర్‌ఆర్‌’ సెట్‌లో చిర్రుబుర్రులాడిన చరణ్
  • వీడియో షేర్ చేసిన తారక్
'RRR' Movie: సెట్‌లో రామ్ చరణ్‌ అసహనం, వీడియో షేర్‌ చేసిన తారక్‌

RRR Movie: యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌(NTR), మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌(RAM CHARAN) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌(RRR Movie). రాజమౌళి(RAJMOULI) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది.

చరణ్‌-తారక్‌లపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. నేటి నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ ఉక్రెయిన్‌(Ukraine)లో మూవీ షూటింగ్‌కు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పడు ఆర్‌ఆర్‌ఆర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పంచుకోనున్నట్లు తారక్‌(TARAK) తెలిపాడు. ఇందులో భాగంగా ఆయన తాజాగా ఓ వీడియో షేర్‌ చేశారు. రామ్‌చరణ్‌(RAM CHARAN) కొంత అసహనానికి గురైనట్లు ఇందులో చూడవచ్చు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RRR Movie (@rrrmovie)

Also Read: సూపర్‌స్టార్‌ బర్త్‌డే బ్లాస్టర్‌ అదుర్స్, కేక పుట్టిస్తున్న మహేశ్ లుక్స్

చరణ్‌ డ్రమ్స్‌ ప్రాక్టీస్‌ అయ్యిందా?’ అని తారక్‌ అడగ్గా.. ‘అయిపోయింది. నిజమైన డ్రమ్స్‌ ఎక్కడ కార్తికేయ. కాస్ట్యూమ్‌ లేదు. ఏం లేవు. పొద్దుపొద్దునే తీసుకువచ్చి కూర్చొపెట్టారు’ అని రాజమౌళి కుమారుడిపై చరణ్‌ సరదాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న కార్తికేయ(Karthikeya).. ‘వస్తున్నాయి. రెండు నిమిషాలు’ అని నవ్వుతూ సమాధానమిచ్చారు. దసరాకి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR Movie) రానున్నట్లు చరణ్‌ మరోసారి ఈ వీడియోలో స్పష్టం చేశారు.

ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు(Alluri Sitaramaraju)గా రామ్‌చరణ్‌, కొమురంభీమ్‌(Komurambhim)గా తారక్‌ కనిపించనున్నారు. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో ఇది రూపుదిద్దికుంటోంది. ఆలియాభట్(Alia Bhatt), అజయ్‌ దేవ్‌గణ్‌(Ajay Devgan), శ్రియ(Shreya), సముద్రఖని, ఒలీవియా మోరీస్‌(Olivia Morris), ఎలిసన్‌ డ్యూడీ తదితరులు ఇందులో కీలకపాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి(Keeravani) సంగీతం అందిస్తున్నారు. ఇటీవల రిలీజైన ‘దోస్తీ’ సాంగ్‌, మేకింగ్‌ వీడియో సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. దసరా(Dussehra) కానుకగా అక్టోబర్‌ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read:చిరు ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆచార్య మూవీ లేటెస్ట్ అప్‌డేట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link -  https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News