K Vishwanath Wife Jayalkshmi Died: టాలీవుడ్ సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ఫిబ్రవరి రెండో తేదీన కళాతపస్వికే విశ్వనాథ్ కన్నుమూసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ విషాద వార్త మరువకముందే ఆయన సతీమణి కాశీనాధుని జయలక్ష్మి కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కె విశ్వనాథ్ మరణించినప్పటి నుంచే తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమె గత కొద్ది రోజులుగా అపోలో ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నారు.
అయితే అనారోగ్య పరిస్థితులు విషమించడంతో ఈరోజు సాయంత్రం 6:15 నిమిషాల ప్రాంతంలో ఆమెతో తుది శ్వాస విడిచినట్లుగా కుటుంబ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. తమ తండ్రి కె విశ్వనాథ్ కన్నుమూసిన వార్డులోనే తమ తల్లి జయలక్ష్మి కూడా కన్నుమూయటం దురదృష్టకరమని వారు ప్రకటనలో పేర్కొన్నారు. ఆమె పార్థివ దేహాన్ని కొద్దిసేపట్లో ఫిలింనగర్ ప్రాంతంలో ఉన్న నివాసానికి తరలించనున్నారు. రేపు పంజాగుట్ట స్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరపబోతున్నట్లుగా ప్రకటనలో పేర్కొన్నారు.
శ్రీ కాశీనాధుని జయలక్ష్మి వయసు ప్రస్తుతం 88 సంవత్సరాలు. ఆమెకు 15 ఏళ్ల వయసున్నప్పుడే కే విశ్వనాథ్ తో వివాహం జరిగింది. కె విశ్వనాథ్ మరణించినప్పటి నుంచి ఆయన మీద ఉన్న ప్రేమతో ఆమె మంచానికే పరిమితమైనట్లు తెలుస్తోంది. ఇక ఆమె పార్థివ దేహాన్ని అపోలో హాస్పిటల్ నుంచి ఫిలిం నగర్ లో ఉన్న నివాసానికి తరలించారు.
విశ్వనాథ్ దంపతుల పెద్ద కుమారుడు ప్రస్తుతం అమెరికాలో ఉన్న నేపథ్యంలో ఆయన వచ్చిన తర్వాత అంత్యక్రియలు జరుపుతారా లేక రేపు జరుపుతారు అనే విషయం మీద క్లారిటీ లేదు. అయితే అంతిక్రియలు మాత్రం విశ్వనాథ్ అంత్యక్రియలు జరిగిన పంజాగుట్ట స్మశాన వాటికలోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కె విశ్వనాథ్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయిన శైవ సంప్రదాయం పాటిస్తూ ఉండడంతో వీరి అంత్యక్రియలు వేరుగా జరుపుతారని తెలుస్తోంది, ఈ నేపథ్యంలో విశ్వనాథ్ అంత్యక్రియలు కూడా వేరుగా జరగా ఈ అంశం మీద పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి.
Also Read: ketika Sharma Photos: కేతిక శర్మ యమా హాటు గురూ.. మరోసారి ట్రీట్ ఇచ్చేసింది.. మరి ఆ సంగతేంటి?
Also Read: Actress Tulasi Video: నా మీద మీకు ఇంత ప్రేమ ఏంటండీ,, నాకు ఇంకేం అక్కర్లేదంటూ వీడియో రిలీజ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook