Spy Movie Total Collections: స్పై మూవీ కలెక్షన్స్ అదుర్స్.. నిఖిల్‌కి మళ్లీ పండగే

Spy Movie Total Collections: 18 పేజెస్ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన నిఖిల్ తాజాగా స్పై మూవీతో ఆడియెన్స్ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. స్పై మూవీలో గూఢచారి పాత్రలో కనిపించిన నిఖిల్.. ఈ సినిమాతో కూడా ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తున్నాడు.

Written by - Pavan | Last Updated : Jul 1, 2023, 07:17 PM IST
Spy Movie Total Collections: స్పై మూవీ కలెక్షన్స్ అదుర్స్.. నిఖిల్‌కి మళ్లీ పండగే

Spy Movie Total Collections: 18 పేజెస్ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన నిఖిల్ తాజాగా స్పై మూవీతో ఆడియెన్స్ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. స్పై మూవీలో గూఢచారి పాత్రలో కనిపించిన నిఖిల్.. ఈ సినిమాతో కూడా ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన స్పై మూవీలో నిఖిల్ సరసన ఐశ్వర్యా మీనన్ జంటగా నటించింది. గూఢచారి, క్షణం, ఎవరు, హిట్: ది ఫస్ట్ కేస్ వంటి సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్ సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసిన గ్యారీ బిహెచ్ తొలిసారిగా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఎడిటర్‌ గ్యారీ బిహెచ్‌కి దర్శకుడిగా ఇది తొలి సినిమానే అయినప్పటికీ.. తొలి ప్రయత్నంలోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు.

స్పై మూవీ ఫస్ట్ డే నాడు 11.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టగా.. రెండో రోజు నాడు మరో రూ. 4.1 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. దీంతో రిలీజైన తరువాత తొలి 2 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 15.8 కోట్లు వసూలు చేసి హీరో నిఖిల్ కెరీర్లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. స్పై మూవీ కలెక్షన్స్‌ని వెల్లడిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ ఈడీ ఎంటర్‌టైన్మెంట్స్ స్వయంగా ఒక పోస్టర్‌ని విడుదల చేసింది. స్పై మూవీని నిఖిల్ కెరీర్‌లోనే హైయెస్ట్ గ్రాసర్ మూవీగా ఈ పోస్టర్‌లో పేర్కొన్నారు. 

స్పై మూవీకి పబ్లిక్ టాక్ కూడా బాగుండటంతో శని, ఆదివారాల్లో ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ మరింత పుంజుకునే అవకాశం ఉంది అని బాక్సాఫీస్ ట్రేండ్ పండిట్స్ చెబుతున్నారు. ఈ ఫస్ట్ వీకెండ్‌తో సినిమా మ్యాగ్జిమం బ్రేక్ ఈవెన్ పాయింట్ క్రాస్ చేస్తుందని ఫిలింనగర్ టాక్.

ఇడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్మపై కే రాజశేఖర రెడ్డి నిర్మించిన స్పై మూవీకి కథను కూడా ఆయనే అందించడం మరో విశేషం. ఒక రకంగా ఈ సినిమా నిఖిల్‌కి మాత్రమే కాకుండా ఎడిటర్ కెరీర్ నుంచి డైరెక్టర్ కెరీర్‌కి షిఫ్ట్ అయిన గ్యారీ బీహెచ్‌కి, నిర్మాతగా సినిమాలు నిర్మిస్తూనే కథ రాసుకోవడమే కాకుండా ఆ కథపై పట్టును సాధించిన నిర్మాత రాజశేఖర్ రెడ్డికి కూడా సక్సెస్‌ని అందించిన సినిమాగా చెప్పుకోవచ్చు.

Trending News