Vikram Trailer: 'విక్రమ్‌' ట్రైలర్‌ వచ్చేసింది.. అంచనాలు మరిన్ని పెరిగాయి!

Kamal Haasan's Vikram movie Trailer out. విక్రమ్‌ ట్రైలర్‌ను చిత్ర బృందం ఆదివారం విడుదల చేసింది. కమల్‌ హాసన్‌, విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ లుక్స్‌, నటన అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 15, 2022, 09:08 PM IST
  • 'విక్రమ్‌' ట్రైలర్‌ వచ్చేసింది
  • అంచనాలు మరిన్ని పెరిగాయి
  • కీలక పాత్రలో శివాని నారాయణన్
Vikram Trailer: 'విక్రమ్‌' ట్రైలర్‌ వచ్చేసింది.. అంచనాలు మరిన్ని పెరిగాయి!

Kamal Haasan's Vikram movie Trailer out: యంగ్‌ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న సినిమా 'విక్రమ్‌'. తమిళ స్టార్ హీరో విజయ్‌ సేతుపతి, మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రలు పోషించారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్‌తో కలిసి కమల్‌ హాసన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  విక్రమ్‌ సినిమా జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలలో వేగం పెంచింది.

విక్రమ్‌ ట్రైలర్‌ను చిత్ర బృందం ఆదివారం విడుదల చేసింది. రెండు నిమిషాల 38 సెకండ్ల నిడివిగల ఈ ట్రైలర్‌.. ప్రేక్షకులను అలరిస్తోంది. కమల్‌ హాసన్‌, విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ లుక్స్‌, నటన అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. డైలాగ్స్, యాక్షన్ సీన్స్ బాగున్నాయి. ఈ సినిమాలో కమల్‌ హాసన్‌ 'రా' ఏజెంట్‌గా కనిపించనున్నాడు. అనిరుధ్‌ అందించిన నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 

యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన విక్రమ్‌ సినిమాలో ముగ్గురు స్టార్ హీరోలు కలిసి నటించడం ఇదే మొదటిసారి. దాంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. విక్రమ్‌లో కాళిదాస్ జయరామ్, నరేన్, అర్జున్ దాస్ మరియు శివాని నారాయణన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చగా.. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్. 

ఖైదీ, మాస్టర్‌ చిత్రాల తర్వాత లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన సినిమా విక్రమ్‌. లోకేష్‌ డైరెక్షన్, ముగ్గురు విలక్షణ నటులు కలిసి నటించడంతో విక్రమ్‌ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ట్రైలర్‌ ఆ అంచనాలను మరిన్ని పెంచేలా ఉంది. కమల్‌ హాసన్‌ స్వయంగా నిర్మించిన ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో సూర్య అతిథిగా కనిపిస్తారని సమాచారం.

Also Read: Mehreen Pirzada Pics: వెరైటీ డ్రెస్సులో మెహ్రీన్ పిర్జాదా.. సగం వరకే షర్ట్ వేసుకుని..!

Also Read: CSK vs GT: వృద్ధిమాన్ సాహా సూపర్ షో.. చెన్నైపై గుజరాత్ ఘన విజయం! 20 పాయింట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News