Indian 2: భారతీయుడు 2 లో సేనాపతి వయసు.. దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కమల్ హాసన్

Indian 2 Update:  భారీ అంచనాల మధ్య.. కమల్ హాసన్ హీరోగా.. నటిస్తున్న భారతీయుడు 2 త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మధ్యనే విడుదలైన.. ఈ చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి.. మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమాలో సేనాపతి.. పాత్ర వయసు ఎంత ఉంటుంది.. అని చర్చ మొదలైంది. ఈ ప్రశ్నకి స్వయంగా కమల్ హాసన్ మంచి జవాబు ఇచ్చారు.   

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 29, 2024, 01:43 PM IST
Indian 2: భారతీయుడు 2 లో సేనాపతి వయసు.. దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కమల్ హాసన్

Indian 2 Story: కమల్ హాసన్ హీరోగా.. తెరకేక్కుతున్న భారతీయుడు 2 సినిమాపై.. అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్.. ప్రేక్షకులకి చాలా బాగా నచ్చింది. అయితే ఈ సినిమాలో.. సేనపతి పాత్ర వయసు ఎంత ఉంటుందో.. అని సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. 

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు.. కమల్ హాసన్ కు కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. సినిమాలో సేనపతి పాత్ర వయసు ఎంత ఉంటుంది.. అని అడగగా కమల్ హాసన్ దానికి అదిరిపోయే జవాబు ఇచ్చారు. "వయసు గురించి అడుగుతుంటే చాలా సిగ్గుగా ఉంది. అసలు ఈ ప్రశ్నకి జవాబు చెప్పకూడదు. కానీ నేను చెబుతాను. మీరు ఎప్పుడు సూపర్ మాన్.. వయసు అడగలేదు. హనుమాన్ వయసు కూడా అడగలేదు. మరి సేనాపతి వయసు.. మాత్రం ఎందుకు" అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు.

"అతను ప్రతి చోటా ఉంటాడు. ఎన్నో యుగాలు దాటుకుంటూ.. వస్తాడు. అందుకే అందరిలో కెల్లా ఎక్కువ కాలం జీవించిన.. దేవుడు" అని చెప్పుకొచ్చారు కమల్ హాసన్. ఇక సినిమాలో కమల్ హాసన్ తండ్రిగా మాత్రమే కాక కొడుకుగా కూడా కనిపించబోతున్నారు. 

సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జె సూర్య, బాబి సింహ, ప్రియ భవాని శంకర్ తదితరులు.. ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. హీరోయిన్గా నటిస్తున్న కాజల్ అగర్వాల్ ఈ సినిమా సీక్వెల్.. భారతీయుడు 3లో కనిపించనుంది. ప్రముఖ కోలీవుడ్ నటులు వివేక్, నెడుముడి వేణు కూడా ఈ సినిమాలో కనిపిస్తున్నారు.

తెలుగు తమిళ్లో మాత్రమే కాక హిందీలో కూడా ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఈ ఏడాది జులై 12న విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలు.. క్రియేట్ చేసింది. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై శుభస్కరన్ అల్లి రాజా సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు. పొలిటికల్ త్రిల్లర్ ఈ చిత్రం కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇక భారతీయుడు 2 కాకుండా కమల్ హాసన్ చేతిలో బోలెడు భారీ బడ్జెట్ ప్రాజెక్టులు.. ఉన్నాయి. ముఖ్యంగా కల్కి 2898 ఏడి సినిమాలో సుప్రీమ్ యాస్కీన్ పాత్రలో అందరి దృష్టిని ఆకర్షించిన కమల్ హాసన్.. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ లో కూడా నటిస్తున్నారు. అంతేకాకుండా కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమాకి రెండవ భాగంగా విడుదల కాబోతున్న భారతీయుడు 3 సినిమాలో కూడా కనిపించనున్నారు.

Read more: Snake Viral Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..

Read more: Lightning strikes: బాప్ రే.. వర్షంలో మైరచిపోయి యువతి రీల్స్ .. పక్కనే పిడుగు పాటు.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News