Kannada Hero Puneeth Rajkumar’s eye donation gives sight to four persons: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండెపోటు తో మరణించడంతో అందరినీ కలచి వేసింది. పునీత్ మరణం కన్నడ ఇండస్ట్రీ ని కుదిపివేసింది. పునీత్ (Puneeth) ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు అంతకన్నా గొప్ప వ్యక్తి కూడా. ఆయన దాతృత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. చనిపోయిన తర్వాత కూడా పునీత్ రాజ్ కుమార్ నలుగురు వ్యక్తుల్లో బతికే ఉన్నారు.
పునీత్ తన కళ్లు ఇతరులకు ఉపయోగపడాలని నేత్ర దానం (Puneeth Rajkumar’s eye donation) చేశారు. ఆయన మరణం తర్వాత తన కళ్ళను శరీరం నుండి సేకరించి బెంగుళూరులోని నారాయణ నేత్రాలయ లో (Narayana Netralaya) భద్రపరిచారు. ఆ కళ్లను నలుగురు యువకులకు అమర్చినట్టు నేత్రాలయ చైర్మన్ డాక్టర్ భుజంగశెట్టి తెలిపారు.
Also Read : Huzurabad By Election Result Live Counting: ముగిసిన 14 రౌండ్లు.. 9,452 ఓట్ల ఆధిక్యంలో ఈటెల
సాధారణంగా ఒక వ్యక్తి దానం చేసిన కళ్లను ఇతరులకు మార్పిడి చేస్తే.. ఇద్దరికి మాత్రమే చూపు దక్కుతుందని డాక్టర్ భుజంగశెట్టి (Dr. Bhujangashetti) చెప్పారు. కానీ పునీత్ కళ్లలోని కార్నియాలోని సుపీరియర్, డీపర్ లేయర్స్‌ని వేరు చేసి నలుగురికి శస్ర్త చికిత్స చేయగలిగామని చెప్పారు. అంటే ఒక్కోకంటిని ఇద్దరి పేషంట్లకు చికిత్సకు వినియోగించామన్నారు. అదే పునీత్ కళ్లకున్న ప్రత్యేకత అని డాక్టర్ భుజంగశెట్టి పేర్కొన్నారు.
ఇక కంటి నిపుణులు డాక్టర్ శెట్టి దీని గురించి వివరించారు. సూపర్‌ఫీషియల్ కార్నియల్ వ్యాధి ఉన్న వారికి సుపీరియర్ లేయర్ మార్పిడి చేశామన్నారు. ఎండోథెలియల్ / డీప్ కార్నియల్ లేయర్ వ్యాధి ఉన్న మరో ఇద్దరికి డీపర్ లేయర్ ట్రాన్స్‌ప్లాంట్ చేశామని తెలిపారు. అలా పునీత్ కళ్లతో (Puneeth Rajkumar) నలుగురికి చూపుదక్కిందని వివరించారు. బహుశా కర్ణాటకలో (Karnataka) ఇలాంటి నేత్రదానం ఎక్కడా జరిగి ఉండదని అని చెప్పారు.
Also Read : Aadhaar and Pancard: మరణానంతరం ఆధార్‌కార్డు, పాన్‌కార్డుల్ని ఏం చేయాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook