Nirupam Paritala : పరిటాల శ్రీరామ్‌తో నిరుపమ్ పరిటాల.. రియల్ హీరో అంటూ డాక్టర్ బాబు కామెంట్స్

Nirupam Paritala with Paritala Sriram కార్తీక దీపం సీరియల్‌ ద్వారా డాక్టర్ బాబు పాత్రలో నిరుపమ్ పరిటాలకు వచ్చిన క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే రియల్ హీరో అంటూ పరిటాల శ్రీరామ్ గురించి నిరుపమ్ చెప్పిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 21, 2023, 04:25 PM IST
  • నెట్టింట్లో కార్తీక దీపం డాక్టర్ బాబు సందడి
  • పరిటాల శ్రీరామ్‌తో నిరుపమ్ పరిటాల
  • రియల్ హీరో అంటూ కామెంట్ చేసిన డాక్టర్ బాబు
Nirupam Paritala : పరిటాల శ్రీరామ్‌తో నిరుపమ్ పరిటాల.. రియల్ హీరో అంటూ డాక్టర్ బాబు కామెంట్స్

Nirupam Paritala with Paritala Sriram కార్తీక దీపం సీరియల్‌తో డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ గడపలో ఫేమస్సే. డాక్టర్ బాబుగా, కార్తీక్‌గా నిరుపమ్ పరిటాల నటనను అందరూ ఇష్టపడుతుంటారు. నిరుపమ్, ప్రేమీ విశ్వనాథ్ పాత్రలే సీరియల్‌కు ప్రధాన ఆకర్షణలా మారాయి. వారిద్దరూ లేకపోతే సీరియల్‌ను ఎవ్వరూ చూడకుండా ఆపేశారు. దీంతో మళ్లీ ఆ పాత్రలను తిరిగి తీసుకొచ్చారు.

అలా కార్తీక దీపం సీరియల్‌తో నిరుపమ్‌కు తిరుగులేని ఫాలోయింగ్ వచ్చింది. ఆ ఫాలోయింగ్‌ను నిరుపమ్ సోషల్ మీడియా ద్వారా ఇంకా ఎక్కువగా పెంచేసుకున్నాడు. సోషల్ మీడియాలో నిరుపమ్ ఎంతో సరదాగా ఉంటాడు. ఆయన స్వతాహగా రైటర్ కూడా కావడంతో పంచ్‌లు, కౌంటర్లు వేస్తుంటాడు. ఆయన సోషల్ మీడియాలో చేసే పోస్టులు ఎక్కువగా ప్రాసలతోనే కూడుకుని ఉంటాయి.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by NIRUPAM PARITALA (@nirupamparitala)

మధ్యలో నిరుపమ్ నిర్మాతగానూ మారాడు. జీ తెలుగులో హిట్లర్ గారి పెళ్లాం అనే సీరియల్‌ను నిర్మించాడు. అందులో హిట్లర్‌గా నటించి అందరినీ ఆకట్టుకున్నాడు. ఇలా ప్రొడక్షన్ సైడ్‌ వచ్చి కూడా నిరుపమ్ సక్సెస్ అయ్యాడు. అయితే నిరుపమ్ పరిటాల అని ఉండటంతో.. పరిటాల రవికి బంధువులా? అని అంతా అనుకుంటారు. కానీ వారికి, తమకు ఎలాంటి రిలేషన్ లేదని నిరుపమ్ ఇది వరకు క్లారిటీ ఇచ్చాడు.

తాజాగా నిరుపమ్ అయితే పరిటాల శ్రీరామ్‌తో ఫోటో దిగి సోషల్ మీడియాలో పెట్టాడు. రియల్ హీరో అంటూ శ్రీరామ్‌ను పొగిడేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. కార్తీక దీపం టీంతో కలిసి ఇలా శ్రీరామ్ ఫోటోకు పోజులు ఇచ్చాడు.

Also Read:  Pathaan Advance Booking : పఠాన్ మేనియా.. ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే.. కింగ్ ఖాన్ కమ్ బ్యాక్ ఇచ్చినట్టేనా?

Also Read: Mahesh Babu Son : గౌతమ్ మొదటి సారి ఆ పని చేయబోతోన్నాడు.. నమ్రత పోస్ట్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News