కత్రినాతో సల్మాన్ మేనల్లుడు షికారు

రాణీ ముఖర్జీ కుమార్తె అదిరా పుట్టినరోజు పార్టీకి వెళ్లిన బాలీవుడ్ ప్రముఖులందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండగా... అదే పార్టీకి వెళ్లిన కత్రినా మాత్రం ఓ ముద్దులొలికే చిన్న బాలుడితో  ఆటల్లో మునిగిపోయారట

Last Updated : Dec 10, 2017, 06:19 PM IST
కత్రినాతో సల్మాన్ మేనల్లుడు షికారు

రాణీ ముఖర్జీ కుమార్తె అదిరా పుట్టినరోజు పార్టీకి వెళ్లిన బాలీవుడ్ ప్రముఖులందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండగా... అదే పార్టీకి వెళ్లిన కత్రినా మాత్రం ఓ ముద్దులొలికే చిన్న బాలుడితో ఆటల్లో మునిగిపోయారట. ఆ కుర్రాడితో కలిసి అక్కడున్న పార్కులో షికారు చేశారట.  సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత కుమారుడైన ఆ బాలుడి పేరే అహిల్.

ఆ సన్నివేశాన్ని చూసిన అర్పిత, అహిల్‌తో కత్రినా ఆటలాడుకుంటున్న ఫోటోలను ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఇటీవలి కాలంలో కత్రినా, సల్మాన్‌తో కలిసి 'టైగర్ జిందా హై' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 22 డిసెంబరు, 2017 తేదిన విడుదలకు సిద్ధమవుతోంది.

140 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రాణిముఖర్జీ భర్త ఆదిత్య చోప్రా నిర్మించడం గమనార్హం. ప్రస్తుతం కత్రినా 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' చిత్రంతో పాటు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వస్తున్న మరో చిత్రంలో కూడా నటిస్తున్నారు. 

Trending News