కీర్తి సురేష్ దీపావళి వేడుకలు ఆమెను సోషల్ మీడియాలో నెటిజెన్స్ నవ్వుకునేలా చేశాయి. కుటుంబసభ్యులతో కలిసి దీపావళి సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేసిన కీర్తి సురేష్ ఆ ఫోటోలు, వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. దివాళి రోజున మార్నింగ్ సెలబ్రేషన్స్ అంటేనే అదో రకమైన సాహసంతో కూడుకున్నవి అంటూ అక్కడ ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ఆ వీడియోలో తన కుటుంబసభ్యులతో కలిసి పటాసులు కాలుస్తూ ఎంజాయ్ చేసిన కీర్తి సురేష్.. ఒకానొక సందర్భంలో ఒక చిన్న పటాసును కాల్చడానికి నానా తంటాలు పడటం వీడియోలో చూడొచ్చు. ఆ పటాసు అంటుకోకముందే భయంతో అక్కడి నుంచి పరుగెత్తడం, మళ్లీ వచ్చి కాల్చేందుకు ప్రయత్నించడం.. అలా ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. పదేపదే అదే రిపీట్ అవడంతో ఆ వీడియో చూసిన నెటిజెన్స్ కీర్తి సురేష్ ఇంత భయస్తురాలా అని నవ్వుకుంటున్నారు.
ఐతే అదే సమయంలో కీర్తి సురేష్ చేసిన ఈ పనిపై ఇంకొంతమంది నెటిజెన్స్ మండిపడుతున్నారు. ఫైర్‌క్రాకర్స్ ( Firecrackers ) కాల్చడం వల్ల పర్యావరణం కాలుష్యం అవుతుందని నలుగురికి చెప్పాల్సిందిపోయి.. సెలబ్రిటీ హోదాలో ఉంటూ బాధ్యాతారాహిత్యంగా ఇదేం పని అంటూ నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు. '' మీలాంటి సెలబ్రిటీలే ఇలా పబ్లిక్ గా పటాసులు కాల్చి.. ఆ ఫోటోల, వీడియోలను పోస్ట్ చేస్తే.. అవి చూసి యూత్ కూడా మీలాగే చేయాలని అనుకుంటారు కదా'' అని కీర్తి సురేష్ వైఖరిపై ( Keerty Suresh bursting firecrackers ) విరుచుకుపడుతున్నారు. నెటిజెన్స్ మండిపాటును కీర్తి సురేష్ గ్రహించిందో లేదో మరి.