Kevvu Karthik Marriage: కాబోయే భార్యను పరిచయం చేసిన కెవ్వు కార్తీక్.. జబర్దస్త్ పోస్ట్ వైరల్

Kevvu Karthik Marriage: కెవ్వు కార్తీక్ పెళ్లి పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. పెళ్లికి సంబంధించిన విషయాన్ని చెబుతూ.. తనకి కాబోయే భార్యను చూపించాడు. జీవితంలో కొత్త చాప్టర్‌ను ప్రారంభిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 6, 2023, 03:46 PM IST
  • నెట్టింట్లో కెవ్వు కార్తీక్ సందడి
  • భార్యను పరిచయం చేసిన కమెడియన్
  • కెవ్వు కార్తీక్ పోస్ట్ వైరల్
Kevvu Karthik Marriage: కాబోయే భార్యను పరిచయం చేసిన కెవ్వు కార్తీక్.. జబర్దస్త్ పోస్ట్ వైరల్

Kevvu Karthik Marriage: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతోన్నాడు. తనకు పెళ్లి సెట్ అయిందని పోస్ట్ వేశాడు. తన భార్యను అందరికీ పరిచయం చేశాడు. స్వర్గంలో పెళ్లిళ్లు నిశ్చయించబడతాయని అంటుంటే ఇన్నాళ్లు నమ్మలేదు గానీ ఇప్పుడు నమ్మాలనిపిస్తోందంటూ ఇలా తనకు కాబోయే భార్య గురించి చెప్పుకొచ్చాడు. 

రెండు విభిన్న మనస్తత్వాలు, భిన్న జీవితాలు, వేర్వేరు ఆలోచనలు, వేర్వేరు ప్రపంచాలు ఇప్పుడు కలిసిపోయాయి.. ఒకే జీవితాన్ని ప్రారంభించబోతోన్నాం.. అంటూ ఇలా తన భార్యను పరిచయం చేశాడు కెవ్వు కార్తీక్. తన భార్య పేరు సిరి అని కూడా చెప్పేశాడు కెవ్వు కార్తీక్. ఇప్పుడు కెవ్వు కార్తీక్ తన ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్‌ను కూడా షేర్ చేశాడు. విదేశాల్లో ఈ ఇద్దరూ చేసిన ఫోటో షూట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kevvu Kartheek (@kevvukartheek)

ఇలా తన భార్యను పరిచయం చేసే కంటే ముందుగా ఓ పోస్ట్ వేశాడు. కొత్త వ్యక్తులు మన జీవితాల్లోకి వచ్చాక చాలా మార్పులు వస్తాయని, అది ఇదే కావొచ్చు.. నువ్ నా జీవితంలోకి వచ్చినందుకు థాంక్యూ బ్యూటీఫుల్.. మన కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నాను అని చెబుతూ ఓ పోస్ట్ వేశాడు. అందులో తన భార్య మొహాన్ని మాత్రం చూపించలేదు.

Also Read: Tamannaah Bhatia Photos: పొట్టి బట్టల్లో రచ్చ రేపుతున్న తమన్నా భాటియా.. ఫొటోలు చూశారా?

కెవ్వు కార్తీక్ జబర్దస్త్ స్టేజ్ మీద కమెడియన్‌గా మంచి పేరు సంపాదించుకున్నాడు. కారెక్టర్ ఆర్టిస్ట్‌గా మొదలై.. టీం లీడర్‌గా ఎదిగాడు. కెవ్వు కార్తీక్, ముక్కు అవినాష్‌ల కాంబో ఒకప్పుడు బాగానే క్లిక్ అయింది. అవినాష్‌ బిగ్ బాస్ షోలోకి వెళ్లడంతో కెవ్వు కార్తీక్‌ సోలో టీం లీడర్‌గా చాన్స్ దక్కించుకున్నాడు. కెవ్వు కార్తీక్ ఇప్పటికీ మంచి ఫాంలోనే ఉన్నాడు. అప్పుడప్పుడు సినిమాల్లోనూ కనిపిస్తున్నాడు.

Also Read: Shruti Reddy Photos: పొట్టి గౌనులో కాక రేపేస్తున్న శృతి రెడ్డి.. వామ్మో?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News