Yash Cameo in Salaar: సాలార్ లో ప్రభాస్ తో యష్.. ఆరోజునే షూట్.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే!

Yash Cameo in Salaar: సలార్ సినిమాలో కేజిఎఫ్ హీరో యష్ అతిథి పాత్రలో కనిపిస్తాడు అనే ప్రచారం చాలా రోజుల నుంచి జరుగుతుండగా ఇప్పుడు షూట్ అప్డేట్ కూడా వచ్చేసింది. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 13, 2023, 07:03 PM IST
Yash Cameo in Salaar: సాలార్ లో ప్రభాస్ తో యష్.. ఆరోజునే షూట్.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే!

Yash Cameo in Salaar Update: ప్రభాస్ హీరోగా సలార్ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 'కేజిఎఫ్', 'కేజీఎఫ్ 2' లాంటి భారీ బ్లాక్ బస్టర్ అందించిన కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. వాస్తవానికి ప్రశాంత్ నీల్ తెలుగు వ్యక్తి అయినా.. కన్నడ సినీ పరిశ్రమకు వెళ్లి అక్కడే ముందు నుంచి పనిచేస్తూ వచ్చారు. 'ఉగ్రం' అనే సినిమాతో దర్శకుడిగా మారిన ఆయన రెండో సినిమా కేజీఎఫ్ తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

  • ఆ తర్వాత కేజిఎఫ్ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మునుపెన్నడూ లేని విధంగా కన్నడ సినిమా మార్కెట్ ని భారీగా పెంచేశారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ హీరోగా సలార్ అనే సినిమా చేస్తున్నారు. కేజిఎఫ్ సిరీస్ తెరకెక్కించిన హోంబలే ఫిలింస్ సంస్థ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు ఒక కీలక పాత్రలో నటిస్తుండగా.. ఆయన కుమారుడు పాత్రలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు.
  • ఇక ఈ సలార్ సినిమాలో కేజిఎఫ్ హీరో యష్ అతిథి పాత్రలో కనిపిస్తాడు అనే ప్రచారం చాలా రోజుల నుంచి జరుగుతుండగా ఇప్పుడు దానికి సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ తెరమీదకు వచ్చింది. అదేమిటంటే సలార్ క్లైమాక్స్ లో యష్ కనిపిస్తాడని అంటున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ మార్చి 12వ తేదీ నుంచి యూరప్ లో జరగబోతుందని అంటున్నారు.
  • సుమారు ఏడు నిమిషాల పాటు సలార్ క్లైమాక్స్ లో యష్ కనిపించబోతున్నాడని, దానికి సంబంధించిన షూటింగ్ మార్చి 12వ తేదీ నుంచి శరవేగంగా జరుగుతుందని అంటున్నారు. ఇక ఈ షూటింగ్ పూర్తి అయిన తర్వాత తన 19వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు.

Also Read: Vedhika Photos: హద్దులు దాటేస్తున్న వేదిక అందాల ఆరబోత.. సెగలు రేపేస్తోందిగా!

Also Read: Mrunal Thakur Photos: జక్కన్న చెక్కిన శిల్పానివా మృణాల్ ఠాకూర్..శిల్పాల మధ్య మెరుస్తోందిగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News