Sudeep vs Ajay Devgn: బాలీవుడ్‌ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు.. స్టార్ హీరోల మధ్య ట్విట్టర్ వార్‌!

Twitter War between Kiccha Sudeep and Ajay Devgn. కేజీయఫ్‌ 2 సినిమా గురించి కిచ్చా సుదీప్‌ మాట్లాడుతూ  బాలీవుడ్‌ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. సుదీప్‌ వ్యాఖ్యలపై బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగన్‌ స్పందించాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 27, 2022, 09:16 PM IST
  • బాలీవుడ్‌ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు
  • స్టార్ హీరోల మధ్య ట్విట్టర్ వార్‌
  • హిందీ జాతీయ భాష కాదు
Sudeep vs Ajay Devgn: బాలీవుడ్‌ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు.. స్టార్ హీరోల మధ్య ట్విట్టర్ వార్‌!

Twitter War between Kiccha Sudeep and Ajay Devgn: భారత దేశంలో ఒకప్పుడు బాలీవుడ్‌ సినిమాలు హల్చల్ చేశాయి. దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో రిలీజ్ అయి రికార్డులు సృష్టించేవి. అయితే  బాహుబలి సిరీస్.. సౌత్ ఇండస్ట్రీనే కాదు నార్త్ ఇండస్ట్రీలో కూడా సత్తాచాటింది. ఆపై పాన్ ఇండియా సినిమాలుగా వచ్చిన కేజీఎఫ్ 1, పుష్ప: ది రైస్, ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు సౌత్ రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. అయితే  ఓ స్టార్ హీరో బాలీవుడ్‌ ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యాయి. లాంగ్వేజ్ వార్‌కు కూడా తెరలేపాయి. విషయంలోకి వెళితే... 

కన్నడ స్టార్‌ హీరో కిచ్చా సుదీప్‌ హీరోగా 'విక్రాంత్ రోణ' సినిమా తెరకెక్కుతోంది. అనూప్ భండారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్.  పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను జీ స్టూడియోస్, కిచ్చా క్రియేషన్స్, షాలిని ఆర్ట్స్, ఇన్వెనియో ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఓ చిత్ర ప్రారంభోత్సవ సందర్భంగా కేజీయఫ్‌ 2 సినిమాపై సుదీప్‌ ప్రశంసలు కురిపించాడు. 

కేజీయఫ్‌ 2 సినిమా గురించి సుదీప్‌ మాట్లాడుతూ... 'హిందీ సినిమాలను తెలుగు, తమిళంలో డబ్బింగ్ చేస్తూ విజయం సాధించడానికి కష్టపడుతున్నా.. అది ఫలించడం లేదు. మనం ప్రతిచోటా విజయం సాదిస్తున్నాం. హిందీ జాతీయ భాష కాదు' అని బాలీవుడ్‌ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. సుదీప్‌ వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో పెద్ద హాట్‌ టాపిక్‌ అయ్యాయి. ముఖ్యంగా నార్త్‌ నుంచి సోషల్‌ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి. తాజాగా బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగన్‌ స్పందించాడు. 'నా సోదరుడా.. కిచ్చా సుదీప్. హిందీ జాతీయ భాష కాకపోతే.. మీ సినిమాలను హిందీలో డబ్‌ చేసి ఎందుకు విడుదల చేస్తున్నారు. హిందీ ఇప్పటికీ ఎప్పటికీ మన మాతృ భాష, జాతీయ భాష. జనగణమన' అంటూ ట్వీట్ చేశాడు.

అజయ్‌ దేవగన్‌ ట్వీట్‌కు సుదీప్‌ రిప్లై ఇచ్చాడు. 'హలో అజయ్‌ సార్‌. మీరు హిందీలో పంపిన మెసేజ్ నాకు అర్థమైంది. మనమందరం హిందీని గౌరవిస్తాం, ప్రేమిస్తాం. మనం అందరం భారతదేశానికి చెందినవాళ్లమే కదా సార్. నా వ్యాఖ్యలకు అసలర్థం అదికాదు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. భారతదేశంలోని అన్ని భాషలపై నాకు గౌరవం ఉంది. నేను ఈ టాపిక్‌ను ఇక్కడితో ముగించాలనుకుంటున్నా' అంటూ సుదీప్‌ వరస ట్వీట్స్‌ చేశాడు. క్లారిటీ ఇచ్చింది, దన్యవాదాలు అంటూ అజయ్‌ దేవగన్‌ బదులిచ్చాడు. దాంతో ఇద్దరి స్టార్ల మధ్య ట్విట్టర్ వార్ ముగిసింది. 

Also Read: Ambati Rayudu Injury: చెన్నైకి మరో ఎదురుదెబ్బ.. అంబటి రాయుడు కూడా..!

Also Read: CSK Fan Girl: అంబటి రాయుడు భారీ సిక్సులు.. వైరల్‌గా మారిన చెన్నై ఫ్యాన్ గర్ల్ రియాక్షన్! ఆమె మరెవరో కాదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News