Kids Video: నెట్టింట సందడి చేస్తోన్న పిల్లల సినిమాటిక్ ఫైట్ వీడియోలు

పిల్లలే కదా అని లైట్ తీసుకోకండి.. వీళ్ల ట్యాలెంట్ మామూలుగా లేదు అని నెటిజెన్లు ( Netizens ) పొగిడేస్తున్నారు. సినిమా సీన్ లా బాగా తీశారు అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

Last Updated : Sep 19, 2020, 06:41 PM IST
    • పిల్లలే కదా అని లైట్ తీసుకోకండి.. వీళ్ల ట్యాలెంట్ మామూలుగా లేదు అని నెటిజెన్లు పొగిడేస్తున్నారు.
    • సినిమా సీన్ లా బాగా తీశారు అని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదంతా కొంత మంది చిన్నారులు తీసిన వీడియోలకు వస్తున్న రెస్పాన్స్.
    • ఈ రోజుల్లో పిల్లలు సాంకేతికతను బాగా వినియోగిస్తున్నారు.
Kids Video: నెట్టింట సందడి చేస్తోన్న పిల్లల సినిమాటిక్ ఫైట్ వీడియోలు

పిల్లలే కదా అని లైట్ తీసుకోకండి.. వీళ్ల ట్యాలెంట్ మామూలుగా లేదు అని నెటిజెన్లు ( Netizens ) పొగిడేస్తున్నారు. సినిమా సీన్ లా బాగా తీశారు అని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదంతా కొంత మంది చిన్నారులు తీసిన వీడియోలకు వస్తున్న రెస్పాన్స్. ఈ రోజుల్లో పిల్లలు సాంకేతికతను బాగా వినియోగిస్తున్నారు. తమకు నచ్చిన హీరో డైలాగ్ ను చెప్పడమే కాదు.. వారి స్టైల్ ను కూడా కాపీ కొట్టడంలో తమ సత్తా ఏంటో చూపిస్తున్నారు. అచ్చం అలాంటిదే ఈ వీడియో. 

ALSO READ| IPL 2020: నేటి నుంచి ఐపిఎల్ షురూ.. మెగా లీగ్ కు సర్వం సిద్ధం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) తాజా చిత్రం అల వైకుంఠపురములో మూవీలోని ఒక ఫైట్ సీన్ ను కొంత మంది చిన్నారు కలిసి తమ స్టైల్లో షూట్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాన్ని చూసిన సెలబ్రిటీలు వారిని పొగడకుండా ఉండలేకపోతున్నారు. గత కొన్ని రోజులుగా టాలీవుడ్ అభిమానులు ఈ వీడియోను బాగా షేర్ చేస్తున్నారు. ఫైట్ సీన్ ను తీసిన విధానం, స్క్రీన్ ప్లే, టెక్నికల్ ఎలిమెంట్స్, ఎలివేషన్ ఇలా ప్రతీ విషయంలో పెర్ఫెక్షన్ చూపించారు. చిన్నపిల్లలే అయినా మస్తు ట్యాలెంటుంది వీరిలో అని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ వీడియోను పలువురు అల వైకుంఠపురములో మ్యూజిక్ డైరక్టర్ థమన్ కు ( Thaman ) ట్యాగ్ చేయగా థమన్ ఈ వీడియోను చూసి తను కూడా రిప్లై చేశాడు. కుమ్మేశారు మీరు.. మా టీమ్ మొత్తానికి ఈ వీడియో పంపించాను అని రాశాడు తన ట్విట్టర్ హ్యాండిల్ లో.

ALSO READ| Calories Count: మీ ఆహారంలో ఎన్ని కేలరీలు ఉన్నాయో తెలుసుకోండి

ఈ వీడియోతో పాటు కేజీఎఫ్ చాప్టర్ 1 ( KGF )కు చెందిన ఒక వీడియో కూడా  ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. ఇందుటో రాకీభాయ్ చిన్నప్పుడు ఒక పోలీసు అధికారితో ఫైట్ సీన్ లో చిన్నారు అద్భుతంగా నటించారు.

ఈ వీడియోను చూసిన కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ అభినందించాడు.

ప్రశాంత్ నీల్ (Prashant Neel ) దర్శకత్వం వహించిన కేజీఎఫ్ చాప్టర్ 1 కు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించింది. ఇందులో రాకీ భాయ్ గా నటించి కన్నడ నటుడు యష్ ను సినీ ప్రేమికులు బాగా మెచ్చుకుంటున్నారు. ఈ మూవీ సీక్వెల్ కేజీఎఫ్ చాప్టర్ 2 ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ప్రకాశ్ రాజ్ మరో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు.

ఈ చిత్రాన్ని సంక్రాంతికి బరిలో ఉంచడానికి టీమ్ మొత్తం బాగా కష్టపడుతోంది.  కాగా ప్రశాంత్ నీల్ తో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్నRRR , ప్రశాంత్ నీల్ చేస్తున్న కేజీఎఫ్ చాప్టర్ 2 పూర్తయ్యాక ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

ALSO READ | Potato Juice : కేన్సర్ సమస్యను దూరం చేసే బంగాళదుంప రసం.. 

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News