Calories Count: మీ ఆహారంలో ఎన్ని కేలరీలు ఉన్నాయో తెలుసుకోండి

కరోనావైరస్ ( Coronavirus ) వల్ల చాలా మంది ఇంటి నుంచే పని చేయడం ప్రారంభించారు. అన్ లాకింగ్ ప్రక్రియ మొదలైనా కానీ అనేక సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయమని చెబుతున్నాయి. 

Last Updated : Sep 19, 2020, 03:24 PM IST
    • కరోనావైరస్వల్ల చాలా మంది ఇంటి నుంచే పని చేయడం ప్రారంభించారు.
    • అన్ లాకింగ్ ప్రక్రియ మొదలైనా కానీ అనేక సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయమని చెబుతున్నాయి.
    • వర్క్ ఫ్రమ్ హోంలో సాధారణ పరిస్థితులు కన్నా ఎక్కువగా పని ఉండటంతో ఎక్కువ సమయం కంప్యూటర్ ముందే కూర్చోవాల్సి వస్తోంది.
    • దీంతో చాలా మంది బరువుపెరుగుతున్నట్టు పరిశోధనలో తేలింది.
Calories Count: మీ ఆహారంలో ఎన్ని కేలరీలు ఉన్నాయో తెలుసుకోండి

కరోనావైరస్ ( Coronavirus ) వల్ల చాలా మంది ఇంటి నుంచే పని చేయడం ప్రారంభించారు. అన్ లాకింగ్ ప్రక్రియ మొదలైనా కానీ అనేక సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయమని చెబుతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోంలో ( WFH ) సాధారణ పరిస్థితులు కన్నా ఎక్కువగా పని ఉండటంతో ఎక్కువ సమయం కంప్యూటర్ ముందే కూర్చోవాల్సి వస్తోంది. దీంతో చాలా మంది బరువుపెరుగుతున్నట్టు పరిశోధనలో తేలింది. ఇలా ఎందుకు పెరుగుతున్నాం అని చాలా మంది ఆలోచిస్తున్నారు. దాని కోసం ఏం తినాలో.. ఏం వద్దో చెక్ చేస్తున్నారో.. మీరు కూడా మీ బరువు ఎందుకు పెరుగుతోందో తెలసుకోవాలి అనుకుంటే .. ఏ ఆహార పదార్థంలో ఎన్ని కేలరీస్ ఉన్నాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ALSO READ| Beauty Tips: కొరియా అమ్మాయిల బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా?

కేలరీస్ లెక్కలు ఇవే..

1. ఒక ప్లేట్ రైస్ ( అంటే 60 గ్రాములు ) లో 262 కేలరీస్ ఉంటాయి.
2. 20 లేదా 25 గ్రామల పిండితో తయారు అయ్యే చపాతీలో 60 కేలరీస్ ఉంటాయి. మీ శరీరంలో కేలరీస్ మీరు తీసుకునే చపాతీని బట్టి ఉంటుంది.
3. ఒక కప్పు పాలలో ( అంటే 30 మిలీ ) లోరెండు చెంచాల చెక్కర మిక్స్ చేస్తే మొత్తం 36 కేలరీస్ అవుతుంది.
4. ఒక మీడియం సైజు పూరిని చేయడానికి సుమారు 10 గ్రాముల పిండి వాడుతారు. ఇందులో 125 కేలరీస్ ఉంటాయి. ఎన్ని పూరిలు తింటే అన్ని కేలరీస్ పెరుగుతాయి.
5. బాగా నెయ్యి వేసి చేసే రుచికరమైన పాయసం మనలో చాలా మందికి ఇష్టం. అయితే ఒక కప్పు పాయసం తింటే శరీరంలో 369 కేలరీస్ వచ్చి చేరుతాయి.
6. ఒక చిన్ని కప్పు బంగాళ దుంప కూర లేదా మంచి గ్రేవీతో చేసే బంగాళ దుంప కర్రీ ( ఒక కప్పు ) 123 కేలరీస్ ఉంటాయి.
7.  ఈ మధ్య పెద్ద పెద్ద హోటల్స్ లో పరాటా కూడా ప్యాక్ చేసి డిలవరీ చేస్తున్నారు. ఇలా ఒక మీడియం సైపు పరాటాలో 210 కేలరీస్ ఉంటాయి.
8. భోజనానికి భోజనానికి మధ్య గ్యాప్ లో తినే భుజియా స్నాక్ లో 550 నంచి 600 కేలరీస్ ఉంటాయి.

ALSO READ|  How To Become Slim: స్లిమ్ అవ్వాలి అనుకుంటే ఈ చిట్కాలు పాటించండి

ఈ కేలరీస్ లెక్కలు తెలుసుకుని హైరానా పడే వాళ్లు చాలా మంది ఉంటాయి. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ లో చిరుతిండిని కాస్త ఎవాయిడ్ చేయగలిగితే పెరిగే బరువును అదుపు చేయవచ్చు. దాంతో పాటు అప్పుడప్పుడు బ్రేక్ తీసుకుని చిన్న చిన్న వర్కవుట్స్ చేయడం చేస్తుండాలి. ఆరోగ్యాన్ని (Health ) కాపాడుకోవాలి. ఉదయం లేదా సాయంత్రం మేడపై లేదా ఇంట్లోనే నడక కొనసాగించాలి. స్కిప్పింగ్ చేస్తే మరీ మంచిది. ఈ మధ్య వర్క్ ఫ్రమ్ హోంలో చేయాల్సిన వ్యాయామాల గురించి సెలబ్రిటీలు కూడా పలు వీడియోలు షేర్ చేశారు. వాటిని చూసి కూడా మీరు ప్రాక్టిస్ చేయవచ్చు. ఇలాంటి మరిన్ని ఆర్టికల్స్ కోసం రెగ్యులర్ గా మా వెబ్ సైట్ ను విజిట్ చేస్తూ ఉండండి. 

ALSO READ| Chyavanprash: చ్యవన్ ప్రాష్ వల్ల ఇమ్యూనిటీ పెరగుతుంది..ఇన్ఫెక్షన్స్ దరి చేరవు

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

Trending News