Rules Ranjann: ఓటీటీలోకి ‘రూల్స్‌ రంజన్‌’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Kiran Abbavaram : ఈ సంవత్సరం ఇప్పటికే మూడు సినిమాల్లో నటించాడు తెలుగు హీరో కిరణ్‌ అబ్బవరం. వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్‌, రూల్స్‌ రంజన్‌ సినిమాల తో మెరిశాడు ఈ యంగ్‌ హీరో. కాగా ఇందులో కిరణ్ నటించిన రూల్స్ రంజన్ లోని సమ్మోహనుడా సాంగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ పాట ఈ చిత్రంపై అంచనాలను కూడా పెంచింది. కాగా థియేటర్స్ లో మాత్రం నిరాశపరిచిన ఈ సినిమా ఇప్పుడు ఓటిటిలోకి రానుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 19, 2023, 08:10 PM IST
Rules Ranjann: ఓటీటీలోకి ‘రూల్స్‌ రంజన్‌’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Rules Ranjann on OTT:హిట్లు.. ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్న హీరోల్లో ముందు స్థానంలో ఉంటారు కిరణ్ అబ్బవరం. కాగా ఈ మధ్య ఈ హీరో దగ్గర నుంచి వచ్చిన చిత్రం రూల్స్ రంజన్. నేహా శెట్టి హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం కేవలం పరవాలేదు అనిపించుకుంది.
అక్టోబర్‌ 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలో లో  సమ్మోహనుడా వంటి సూపర్‌ హిట్‌ మెలోడి సాంగ్‌ ఉండటంతో ఈ చిత్రంపై విడుదలకు ముందు అంచనాలు మంచిగానే ఉన్నాయి. కానీ విడుదల అయ్యాక మాత్రం అంచనాలు అందుకోవడంలో ఈ సినిమా విఫలమయింది.

కాగా సూపర్ హిట్ సినిమాలు సైతం విడుదలైన నెల రోజులకే ఓటీటి లో ప్రత్యక్షమవుతూ ఉంటే.. యావరేజ్ గారిన ఈ చిత్రం మాత్రం ఇంకా డిజిటల్ స్ట్రీమింగ్ కి రాకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ చిత్రం విడుదల ఈ నెల రోజులు కావస్తున్న నిన్న మొన్నటి వరకు ఈ సినిమా ఓటీటీ గురించి అసలు చడి చప్పుడు లేదు. దాంతో ఈ సినిమా థియేటర్స్ లో చూడని వారు ఈ చిత్రం ఎప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తుంది అని ఎదురు చూడటం మొదలుపెట్టారు.

ఇక ఇన్ని రోజులకు ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్ వీడియో ఈ కిరణ్ అమ్మవరం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. థియేటర్లలో రిలీజుకు ముందు మూవీపై మంచి అంచనాలు ఉండడంతో.. అందులో సమ్మోహనుడా సినిమా దేశవ్యాప్తంగా ఇంస్టాగ్రామ్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడం తో.. ఈ చిత్రాన్ని భారీ ధరకే డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 1 నుంచి రూల్స్‌ రంజన్‌ సినిమాను అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.

కాగా గతంలో తరుణ్, త్రిష, శ్రియ నటించిన నీ మనసు నాకు తెలుసు సినిమా తీసిన ప్రముఖ నిర్మాత ఏఎమ్‌ రత్నం తనయుడు జ్యోతికృష్ణ రూల్స్‌ రంజన్‌ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని స్టార్ లైట్‌ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై దివ్యాంగ్‌ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించారు. అమ్రీశ్ సంగీతం అందించారు. ఈ సినిమాలో మెహర్‌ చాహల్‌ సెకెండ్‌ హీరోయిన్‌గా నటించింది. హైపర్‌ ఆది, హర్ష చెముడు, వెన్నెల కిశోర్‌, సుబ్బరాజు, నాగినీడు, మకరంద్‌ దేశ్‌ పాండే,గోపరాజు రమణ, అభిమన్యు సింగ్‌ సుదర్శన్‌ తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు.

Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంటే

Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x