SK Krishnakanth Death: విషాదం.. గుండెపోటుతో సినీ నిర్మాత కన్నుమూత

ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నిర్మాత కృష్ణకాంత్‌ (52) గుండెపోటుతో కన్నుమూశారు (Producer SK Krishnakanth Passes Away).

Last Updated : Oct 2, 2020, 09:08 AM IST
SK Krishnakanth Death: విషాదం.. గుండెపోటుతో సినీ నిర్మాత కన్నుమూత

కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నిర్మాత కృష్ణకాంత్‌ (52) గుండెపోటుతో కన్నుమూశారు (SK Krishnakanth Passes Away). గత కొన్ని వారాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణకాంత్‌‌కు బుధవారం ఛాతీలో నొప్పి రావడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నిర్మాతను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతిచెందినట్లు (SK Krishnakanth Dies) నిర్ధారించారు. నిర్మాత కృష్ణకాంత్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 

లక్ష్మీ మూవీ మేకర్స్‌ సంస్థలో మేనేజర్‌గా సినీ జీవితాన్ని ప్రారంభించిన కృష్ణకాంత్‌ అనంతరం నిర్మాతగా మారారు. ధనుష్ నటించిన తిరుడా తిరిడి చిత్రంతో నిర్మాత అవతారమెత్తారు. శింబు హీరోగా ఆయన నిర్మించిన మన్మధ, విక్రమ్ సినిమా కింగ్.. ఆయనకు నిర్మాతగా పేరు తీసుకొచ్చాయి.  

తిరుడా తిరుడి దర్శకుడు సుబ్రమణ్యంశివ, నటుడు శింబు, దర్శకనిర్మాత టీ రాజేందర్, తదితరులు కృష్ణకాంత్‌ మృతికి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిర్మాత కృష్ణకాంత్‌ అంత్యక్రియలు గురువారం చెన్నైలో నిర్వహించారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Trending News