Kraven The Hunter Release Date: జనవరి 1 న విడుదల కానున్న మోస్ట్ అవేటేడ్ హాలీవుడ్ మూవీ క్రావెన్: ది హంటర్..

Kraven The Hunter Release Date: గత కొన్నేళ్లుగా హాలీవుడ్ చిత్రాలు కూడా తెలుగులో మంచి ఫలితాలను అందుకుంటున్నాయి. ఈ కోవలో భారతీయ ప్రేక్షకులను పలకరించబోతున్న మరో ఇంగ్లీష్ చిత్రం ‘క్రావెన్.. ది హంటర్’. ఈ సినిమా మన ప్రేక్షకుల కోసం హిందీ, తెలుగు సహా పలు ప్రాంతీయ భాషల్లో కొత్త యేడాది తొలి రోజున విడుదల చేస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 18, 2024, 01:40 AM IST
Kraven The Hunter Release Date: జనవరి 1 న విడుదల కానున్న మోస్ట్ అవేటేడ్ హాలీవుడ్ మూవీ  క్రావెన్: ది హంటర్..

Kraven The Hunter Release Date: హాలీవుడ్ లో  మైండ్ బ్లోయింగ్ సూపర్ హీరో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం ‘క్రావెన్: ది హంటర్’. ఈ సినిమా మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను సోనీ సంస్థ ప్రొడ్యూస్ చేసింది.   ఈ సినిమాను హిందీ, తెలుగు సహా ప్రాంతీయ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా  ఆర్ రేటింగ్ వచ్చిన నేపథ్యం లో డైరెక్టర్ చందూర్ మీడియా తో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమాను ఆర్ రేటింగ్ రావడం ఒక వరం గా భావిస్తున్నాన్నారు. దీని ద్వారా కథ కి నేను న్యాయం  చేయగలను అని అనిపిస్తుంది. క్రావెన్ కథ ని ప్రేక్షకులను నచ్చేలా చెప్పడం కత్తి మీద సామే. అందుకే ఈ సినిమా కి ఆర్ రేటింగ్ రావడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశమనే చెప్పాలి.
 
‘క్రావెన్’ స్టోరీ విషయానికొస్తే.. కోపం, ఆవేశం తో సెర్గీ ఇద్దరు పిల్లలని  కాస్త యుక్త వయసులో చంపేస్తాడు. ఆ తర్వాత అతను ఈజీగా ఎస్కెప్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ అతనలా చేయకుండా ఉంటాడు. అందుకు కూడా ఒక జస్టిఫికేషన్ ఉంది: చనిపోయిన ఇద్దరూ చెడ్డ వ్యక్తులు అని అతను భావిస్తాడు. దీంతో తన  కోపావేశంతో అతను ఈ భూమి మీద నుంచి ఇద్దరిని చంపేశా అని భావిస్తుంటాడు.  ఆ కోపమే ఈ కథ కి మెయిన్ లీడ్.

క్రావెన్: ది హంటర్ సినిమా ఆద్యంత యాక్షన్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులను అలరించడం పక్కా అని ఈ సినిమా టీజర్, ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. మార్వెల్ కి సంబందించిన ఒక ఐకానిక్ విలన్ కథ ని మనం ఈ సినిమాలో చూడొచ్చన్నారు. ఆరాన్ టేలర్-జాన్సన్, అతని గ్యాంగ్స్టర్ తండ్రి తో ఉండే పగ, ప్రతీకారం ప్రేక్షకులను ఆకట్టుకునే అంశమనే చెప్పలి. చాందర్ డైరెక్షన్ లో  వచ్చిన ఈ చిత్రంలో  అరియానా డీ బోస్, ఫ్రెడ్ హెచ్చింగర్, అలెసాండ్రో నీవోలా, క్రిస్టోఫర్ అబ్బాట్ మరియు రస్సెల్ క్రౌ లీడ్ రోల్స్ చేశారు. ఈ సినిమా జనవరి 1 న ఇంగ్లీష్, హిందీ, తమిళ్, మరియు తెలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.

ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..

ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News