Vijay Devarakonda: సింహాద్రి అప్పన్న సేవలో విజయ్ దేవరకొండ

Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇవాళ విశాఖ సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. సెప్టెంబరు 01న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా థియేటర్లలో సక్సెస్ పుల్ గా రన్ అవుతుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 5, 2023, 10:27 PM IST
Vijay Devarakonda: సింహాద్రి అప్పన్న సేవలో విజయ్ దేవరకొండ

Vijay Devarakonda visit Simhachalam: 'ఖుషి' మూవీ(Kushi Movie) సూపర్ హిట్ కావడంతో విజయదేవరకొండ వరుస టూర్లు వేస్తున్నాడు. మెున్న యాద్రాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న విజయ్.. తాజాగా విశాఖ సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. గుడిలో కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్న విజయ్(Vijay Devarakonda) అంతరాలయంలో పూజలు చేశారు. దర్శనానంతరం విజయ్ మాట్లాడుతూ.. అప్పన్న ఆలయం దాని చుట్టుపక్కల ప్రకృతి అందాలు, స్వామివారి శిల్ప  సంపద ఆకట్టుకున్నాయని చెప్పుకొచ్చారు. ఎప్పటి నుంచే స్వామివారిని దర్శించుకోవాలన్న కోరిక ఈరోజుతో తీరిందన్నారు. 

విజయ్ దేవరకొండ, సమంత లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తోంది. సెప్టెంబరు 01న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. నాలుగో రోజు నుంచి కాస్త వసూళ్లు తగ్గాయనే చెప్పాలి. ఖుషి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 53.50 కోట్లుగా నమోదు అయింది. దీంతో వరల్డ్ వైడ్ గా రూ. 52.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ సినిమా. 

తాజాగా ఖుషి సక్సెస్ మీట్ విశాఖలో జరిగింది. ఈ కార్యక్రమంలోవిజయ్ మాట్లాడుతూ.. తాను సంపాదించిన మెుత్తంలో కోటి రూపాయలను వంద కుటుంబాలకు.. ఒక్కో కుటుంబానికి లక్ష చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. ఖుషి మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం ఈ సినిమాలో సచిన్ ఖేడేకర్, శరణ్య పొన్వన్నన్, మురళీ శర్మ, లక్ష్మి మరియు రాహుల్ రామకృష్ణ తదితరులు కీ రోల్స్ చేశారు. విజయ్ త్వరలో VD 12 మూవీలో నటించనున్నాడు. 

Also Read: Balagam Narsingam: టాలీవుడ్‌లో విషాదం.. బలగం నటుడు కన్నుమూత..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News