Kushita Kallapu: చీజ్ బజ్జీల పాప, హీరోయిన్ గా నటిస్తూ ఇలాంటి పనులు అవసరమా?

Kushita Kallapu in Rama Banam Movie: చీజ్ బజ్జీల  పాపగా ప్రచారంలోకి వచ్చిన ఖుషిత కళ్లపు తాజాగా గోపీచంద్ రామబాణం సినిమాలో ఒక కీలక పాత్రలో నటించింది కానీ ఆమె అభిమానులే ఆమె మీద ఫైర్ అవుతున్నారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : May 7, 2023, 04:19 PM IST
Kushita Kallapu: చీజ్ బజ్జీల పాప, హీరోయిన్ గా నటిస్తూ ఇలాంటి పనులు అవసరమా?

Kushita Kallapu Role in Rama Banam Movie: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది క్రేజ్ అందుకుంటున్నారు. అలాంటి వారిలో ఖుషిత కళ్లపు కూడా ఒకరు. నిజానికి ఆమె పేరు చెబితే ఎవరూ త్వరగా గుర్తుపట్టలేకపోవచ్చు కానీ పబ్బుకి చీజ్ బజ్జీలు తినేందుకు వెళ్లామని చెప్పిన అమ్మాయి అంటే వెంటనే గుర్తుపట్టేస్తారు. ముందుగా షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ, ఇన్స్టాగ్రామ్  లో రీల్స్ వీడియోలు షేర్ చేస్తూ ఫేమస్ అయిన ఖుషిత కళ్లపు ఒక ప్రముఖ పబ్బుపై జరిగిన రైడ్స్ లో చిక్కింది.

అయితే తాను అక్కడికి వెళ్ళింది చీజ్ బజ్జీలు తినడానికి అని చెప్పడంతో సోషల్ మీడియాలో బజ్జీల పాపగా ప్రచారంలోకి వచ్చింది. నిజానికి ఆమెకు ఆ ఇన్సిడెంట్ తర్వాత సోషల్ మీడియాలో మాత్రమే కాదు ఇండస్ట్రీలో కూడా కాస్త క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే హీరోయిన్ గా కూడా ఎంపికైంది. రవితేజ కంటపడడంతో ఆయన నిర్మాణంలో రవితేజ టీం వర్క్స్ బ్యానర్ మీద నారప్ప ఫేమ్ కార్తీక్ రత్నం హీరోగా చాంగురే బంగారు రాజా అనే సినిమాలో ఎంపిక చేసుకున్నారు.

Also Read: Samantha Reply to Nagachaitanya: మనని అవే దూరం చేశాయి.. నాగచైతన్యకి సమంత కౌంటర్?

ఈ సినిమా షూట్ పూర్తయి రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ఈ మధ్యనే మొదలు పెట్టారు. ఆ సంగతి అలా ఉంచితే ఈ భామ తాజాగా రిలీజ్ అయిన రామబాణం సినిమాలో ఒక చిన్న పాత్రలో మెరిసింది. గోపీచంద్ కి కుమార్తె వరుసైన అమ్మాయి పాత్రలో ఆమె కనిపించింది. నిజానికి ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు కానీ ఆమె సినిమా అవకాశం వచ్చింది కదా అని ఎంచుకుని చేసినట్లు ఉంది. కానీ సినిమా డిజాస్టర్ కావడంతో ఆమె చేసిన సినిమా, పాత్ర వృధా అయిపోయింది. నిజానికి హీరోయిన్గా నటిస్తున్న సమయంలో ఇలాంటి చిన్న చిన్న పాత్రలు చేయడానికి అందరూ వెనకాడుతూ ఉంటారు. కానీ ఈ భామ మాత్రం ఎందుకో రిస్క్ చేసి సినిమాలో నటించింది. కానీ ఆ రిస్కు వృధా అయిపోయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక మొత్తం మీద ఆమె అభిమానులైతే ఇలాంటి పని ఎందుకు చేసావు ఖుషిత అంటూ కామెంట్లు పెడుతూ ప్రశ్నిస్తున్నారు.

Also Read: Rama Banam vs Ugram Collections: డిజాస్టర్ టాక్ తోనూ 'ఉగ్రం'ని తొక్కి దూసుకుపోతున్న రామబాణం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News