Laal Singh Chaddha: మొదటి రోజు దారుణంగా వసూళ్లు.. ఆ జాబితాలో దక్కని చోటు!

Laal Singh Chaddha Box Office Day 1 Collections: అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందిన 'లాల్ సింగ్ చద్దా' కలెక్షన్స్ దేశ వ్యాప్తంగా ఏమేరకు ఉన్నాయి అనే విషయం మీద ఒక లుక్ వేద్దాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 12, 2022, 02:09 PM IST
Laal Singh Chaddha: మొదటి రోజు దారుణంగా వసూళ్లు.. ఆ జాబితాలో దక్కని చోటు!

Laal Singh Chaddha Box Office Day 1 Collections: అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందిన 'లాల్ సింగ్ చద్దా' అలాగే అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రూపొందిన 'రక్షా బంధన్' రెండూ ఓపెనింగ్ డే రోజున అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి. రాఖీ సెలవుదినం అయినప్పటికీ థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇక దేశ వ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్స్ ఏమేరకు ఉన్నాయి అనే విషయం మీద ఒక లుక్ వేద్దాం.

నిజానికి పంజాబ్, ఢిల్లీ మరియు యుపిలో 'లాల్ సింగ్ చద్దా'ని బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ సినిమా హాళ్ల వెలుపల నిరసనలు జరిగినప్పటికీ, ఈ సినిమా మొదటి రోజు 'రక్షా బంధన్' కంటే ఎక్కువ వసూళ్లు సాధించింది. అమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటించిన ఈ సినిమా తొలిరోజు 18 కోట్ల రూపాయల వసూళ్లను రాబడుతుందని అంచనా వేశారు. కానీ ఈ సినిమా రూ.12 కోట్లు మాత్రమే వసూలు చేసింది అంటే అంచనా వేసిన దాని కంటే చాలా తక్కువ. ఇక 'రక్షా బంధన్' కూడా అత్యంత నిరాశపరిచిన సినిమాగా నిలిచింది.

అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో ఎమోషనల్ అవుతున్నా ఈ సినిమా మొదటి రోజు రెండంకెల వసూళ్లు కూడా చేయలేకపోయింది. 'రక్షా బంధన్' ఆగస్ట్ 11 గురువారం కేవలం 7 కోట్లు మాత్రమే వసూలు చేసింది. నిజానికి 2022 సంవత్సరపు టాప్ మూవీస్ లిస్టులో 'లాల్ సింగ్ చద్దా' కూడా ఉంది. కానీ 'KGF 2', 'RRR', 'భూల్ భూలయ్యా 2', 'గంగూబాయి కతియావాడి' వంటి సినిమాలు మంచి వసూళ్లు రాబట్టాయి కానీ అమీర్ ఖాన్ చిత్రం 2022 సంవత్సరంలోని మొదటి ఐదు చిత్రాల జాబితాలో కూడా చోటు దక్కించుకోలేకపోయింది.

Read Also: Macherla Niyojakavargam: నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' మూవీ ఆకట్టుకుందా?

Read Also: Shivamogga Subbanna dies: ప్రముఖ గాయకుడు శివమొగ సుబ్బన్న కన్నుమూత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News