Legally Veer A Rare Legal Thriller: తెలుగు ప్రేక్షకులకు అరుదైన లీగల్ థ్రిల్లర్‌ను అందించేందుకు 'లీగల్లీ వీర్' సినిమా సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రల్లో నటించారు. రవి గోగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాను.. సిల్వర్ కాస్ట్ బ్యానర్ పై శాంతమ్మ మలికిరెడ్డి నిర్మించారు. ఇక ఈ చిత్రం విడుదల తేదీని ఈ మధ్యనే ప్రకటించారు. డిసెంబరు 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ క్రమంలో ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండగా..ఈ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హీరో వీర్ రెడ్డి మాట్లాడుతూ, “నా సినీ ప్రస్థానం కరోనా సమయంలో ప్రారంభమైంది. లీగల్ లాయర్‌గా ఉండటం వల్ల ఈ పాత్రకు మంచి అనుభవం దక్కింది. రియల్ కోర్ట్ డ్రామా చూపించే ప్రయత్నం చేశాం, ఇది ప్రేక్షకులకు కొత్త అనుభవం ఇస్తుందని నమ్మకం ఉంది.” అని తెలిపారు.
దర్శకుడు రవి గోగుల మాట్లాడుతూ, “లీగల్ థ్రిల్లర్ అనే సబ్జెక్ట్‌లో పని చేయడం అరుదైన అవకాశం. వీర్ రెడ్డి సహజంగా నటించారు. ప్రతి సీన్ మన చుట్టూ జరుగుతున్నట్టు ఉంటుంది. మేము ఈ సినిమాను ప్రేక్షకుల ఆదరణ పొందగలిగే విధంగా తీర్చిదిద్దాం.” అని అన్నారు.
ఈ సినిమా ప్రత్యేకతలను ప్రస్తావిస్తూ నిర్మాత శాంతమ్మ మలికిరెడ్డి మాట్లాడుతూ, “ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థకు ఉన్న ప్రాముఖ్యతను ఈ సినిమా చూపిస్తుంది. ఈ నెల 27న విడుదలవుతున్న ‘లీగల్లీ వీర్’ను అందరూ చూడాలని కోరుకుంటున్నాం.” అని తెలిపారు.
సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బానర్ పై.. మల్లికి రెడ్డి శాంతమ్మ నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. శంకర్ తమిరి సంగీతం అందిస్తుండగా..సినిమాటోగ్రఫీ.. జాక్సన్ జాన్సన్, అనూష్ గోరక్, ఎడిటింగ్.. ఎస్.బి. ఉద్ధవ్ అందిస్తున్నారు. ‘లీగల్లీ వీర్’ ట్రైలర్, టీజర్‌కు మంచి స్పందన లభించడంతో ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. 27న ప్రేక్షకుల ముందుకు వచ్చే ఈ సినిమా థ్రిల్లింగ్ అనుభవం అందించబోతోంది అని భీమా వ్యక్తం చేశారు సినిమా యూనిట్.
Also Read: YS Jagan Sharmila: బర్త్ డేకు విష్ చేయని షర్మిల! వైఎస్ జగనన్న అంటే అంత కోపమా?
Also Read: YS Sharmila: న్యూ ఈయర్‌కు ఏపీలో మహిళలకు ఉచిత బస్సు.. వైఎస్ షర్మిల ప్రశ్నలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook