LEO 2: లియో 2 అప్పుడే.. కన్ఫామ్ చేసిన లోకేష్ కనగరాజ్

Lokesh Kanagaraj: మాస్టర్ సినిమా తర్వాత విజయ్ తో లోకేష్ కనగరాజ్ తీసిన చిత్రం లియో. LCU లో భాగంగా వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. కాగా ఇప్పుడు ఈ సినిమా రెండో భాగం గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు దర్శకుడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 29, 2023, 07:30 AM IST
LEO 2: లియో 2 అప్పుడే.. కన్ఫామ్ చేసిన లోకేష్ కనగరాజ్

Vijay LEO 2: తమిళ వారికే కాదు తెలుగువారికి కూడా ఎంతో ఇష్టమైన ధైర్యం లోకేష్ కనగరాజ్. తన LCUలో భాగంగా వచ్చిన సినిమాలన్నీ తెలుగులో కూడా సూపర్ హిట్ సాధించాయి. ముఖ్యంగా ఖైదీ, విక్రమ్ చిత్రాలు తెలుగులో మంచి సక్సెస్ ని అందుకున్నాయి. ఇక ఈ దర్శకుడు తన ఎల్సీయూలో భాగంగా ఈ మధ్యనే తమిళ హీరో విజయ్ తో ‘లియో’ సినిమాని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. టాక్ పరంగా ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చిన కలెక్షన్స్ పరంగా మాత్రం ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోయింది.

అక్టోబ‌ర్ 19న రిలీజ్ అయిన ఈ సినిమా.. బాక్స్ ఆఫీస్ వద్ద 600 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకొని ఈ సంవత్సరం విడుదలైన సినిమాలలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. అయితే ఈ చిత్రం విడుదల తర్వాత కొన్ని వివాదాలు.. విమర్శలు కూడా తెచ్చి పెట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో లియోకి సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ ఫేక్ అని అసలు కథ వేరు ఉండొచ్చని లియో మేకర్సే కామెంట్స్ చేశారు. దాంతో  ఈ సినిమా నిర్మాతలు.. దర్శకుడు చేసిన పనికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.

అయితే ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి ఈ సినిమాకి తప్పకుండా సీక్వెల్ ఉంటుంది అని మాత్రం అందరికీ అర్థమైంది.  ఆ సీక్వెల్ లోనే లియో ఒరిజినల్ ఫ్లాష్‌బ్యాక్ ని చూపించబోతున్నారా..? అనే సందేహాలు కూడా మొదలయ్యాయి. ఇక ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందని అందరిలో నెలకున్న మొదటి ప్రశ్న. కాగా ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించని లోకేష్ ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో జవాబు ఇచ్చారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయినా లోకేశ్ ని లియో 2 ఉంటుందా అని ప్రశ్నించగా.. ఆయన ఉంటుందని బదులిచ్చారు. 

అంతేకాదు ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అని లోకేష్ ని ప్రశ్నించాగ.. “ప్రస్తుతం నేను ‘తలైవా 171’ చేస్తున్నాను. ఆ సినిమా తరువాత ‘ఖైదీ 2’ తెరకెక్కించాల్సి ఉంది. ఈ రెండు పూర్తి అయిన తరువాత లియో 2 ని మొదలుపెడతాను” అంటూ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చేశారు దర్శకుడు. కాగా ఖైదీ 2లో LCUలో ఉన్న పాత్రలు అన్ని కనిపించబోతున్నాయని లోకేశ్ గతంలో తెలియజేశారు. ఖైదీ 2 ఒక పాత్రకి సంబంధించిన సినిమా కాదని, దానిలో విక్రమ్, రోలెక్స్, అమర్, లియో.. ఇలా అన్ని పాత్రలు ఉండనున్నాయని వెల్లడించారు. కార్తీ ఖైదీ చిత్రం ఎంత సూపర్ హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి ఈ రెండో భాగం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

Also Read: Vijaykanth: విజయ్ కాంత్ సినిమా రీమేక్ లతో హిట్లు కొట్టిన చిరంజీవి, వెంకటేష్.. ఆ మూవీస్ ఇవే..!

Also read: Sapota Fruit: ప్రతిరోజు సపోటా తింటున్నారా..? అయితే ఆరోగ్యకరమైన జీవితం మీ సొంతం..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News