Lucky Bhaskar Review and Rating: మహానటి, సీతారామం .. లాంటి సినిమాలతో తెలుగుపేక్షకులను ఆకట్టుకున్న మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్ ..మరోసారి తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో.. వచ్చిన చిత్రం లక్కీ భాస్కర్. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం..
కథ:
భాస్కర్ (దుల్కర్ సల్మాన్).. ఒక మధ్యతరగతి వారు. అతనికి ఒక తమ్ముడు.. చెల్లి.. తండ్రి.. భార్య సుమతి (మీనాక్షి చౌదరి), కొడుకు కార్తీక్ ఉంటారు. తన ఫ్యామిలీని ఆనందంగా చూసుకోవాలి అనుకునే అతనికి.. ఆర్థిక పరిస్థితుల వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. అంతేకాదు ఎంతో నిజాయితీగా పనిచేసిన బ్యాంకులో ప్రమోషన్ కూడా రాదు. దీంతో ఒకరోజు.. తన ఫ్యామిలీని ఆనందంగా చూసుకోవడం కోసం తన బ్యాంకులోనే దొంగతనం చేసి ఒక చిన్న.. ఇల్లీగల్ బిజినెస్ చేస్తారు. ఇక అక్కడి నుంచి భాస్కర్ జీవితం మారిపోతుంది. అసలు భాస్కర్ చేసిన పని ఏమిటి.. దాని వల్ల అతను ఆ తర్వాత ఎదుర్కొన్న పరిస్థితులు ఏమిటి.. తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
నటినటుల పర్ఫామెన్స్.. టెక్నికల్ సిబ్బంది పనితీరు:
దుల్కర్ సల్మాన్ ఎప్పటిలానే తన నాచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. హీరోయిజంతో కాకుండా ఒక సాధారణమైన అబ్బాయిలా కనిపించి ఆకట్టుకునే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో దుల్కర్ ఎప్పుడు ముందుంటారు. ఈ విషయం ఇప్పటికే కళలు కన్నులు దోచాయ్ అంతే, సీతారామన్ సినిమాల ద్వారా ప్రూవ్ అయింది. ఇప్పుడు మరోసారి అదే ప్రూవ్ చేసుకున్నారు ఈ హీరో. మీనాక్షి చౌదరి తన పాత్ర పరిధిలో చక్కగా నటించింది.
వెంకీ అట్లూరి తన కథ చిత్రం సార్ లాగానే.. పెద్దగా ట్విస్టులు.. భారీ కథ ఎంచుకోకుండా.. సాధారణమైన కథతోనే ఎక్కడ బోర్ కొట్టకుండా ఆకట్టుకున్నారు. మ్యూజిక్ అలానే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ రెండు కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరింది. ఈ సినిమా 1989 టైం లో సాగుతుంది. ఆ టైంలో ముంబై ఇల్లులను, బ్యాంకులను చక్కగా చూపించారు. సెకండ్ హాఫ్ లో ఎడిటింగ్ ఇంకొంచెం బాగుంటే.. బాగుండేది.
విశ్లేషణ:
ఫస్ట్ ఆఫ్ మొత్తం.. ఫ్యామిలీ ఎమోషన్స్‌ని చక్కగా చూపించారు దర్శకుడు. అన్నిటికన్నా ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ నటన.. బాగా ఆకట్టుకుంటుంది. ఒక ఫ్యామిలీ కోసం సాధారణమైన యువకుడు.. పెద్ద పెద్ద ఫైట్లు చేయకుండా.. కేవలం తనకున్న తెలివితో ఎంత దూరం వెళ్లారు అనే పాయింట్ అని ఫస్ట్ హాఫ్ లో చాలా బాగా తెరకెక్కించారు డైరెక్టర్. పెద్ద ట్విస్టులు లేకపోయినా మనకి సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. అందుకు ముఖ్యకారణ.. సినిమాని చాలా సాధారణంగా మన చుట్టూ జరిగే కథలాగా తీర్చిదిద్దటం.
ఇక హీరో బ్యాంక్ అకౌంట్ లో 100 కోట్లు పదడంతో ఇంట్రవెల్ పడుతుంది. ఈ సీన్ ..సెకండ్ హాఫ్ పైన మరిన్ని అంచనాలను పెంచుతుంది. సెకండ్ హాఫ్ కూడా ఊహకు అందినట్టే సాగిన పెద్దగా బోర్ కొట్టదు. సెకండ్ హాఫ్ మొత్తం షేర్ మార్కెట్ చుట్టూ తిరుగుతుంది. మొత్తానికి దీపావళికి ఫ్యామిలీతో ఈ సినిమాని సరదాగా చూసేయొచ్చు.
Also read: DSC: మెగా డీఎస్సీకి ముహూర్తం ఫిక్స్.. 16,347 ఉద్యోగాల భర్తీకి ఆరోజే నోటిఫికేషన్ రిలీజ్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.