LYCA Productions New Movie : లైకా ట్వీట్.. ఎవరితో సినిమా?.. విజయ్, అజిత్, తలైవా ఫ్యాన్స్ రచ్చ

LYCA Productions New Movie Buzz లైకా నిర్మాణ సంస్థ తాజాగా వేసిన ట్వీట్ కోలీవుడ్ అభిమానుల్లో కొత్త అనుమానాలను పుట్టేలా చేస్తోంది. కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ రేపు రాబోతోందట.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 4, 2022, 09:01 PM IST
  • కోలీవుడ్ టాప్ ప్రొడక్షన్ కంపెనీ
  • భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్
  • రజినీ లేదా అజిత్‌తో కొత్త సినిమా?
LYCA Productions New Movie : లైకా ట్వీట్.. ఎవరితో సినిమా?.. విజయ్, అజిత్, తలైవా ఫ్యాన్స్ రచ్చ

LYCA Productions New Movie : కోలీవుడ్‌లో భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది లైకా ప్రొడక్షన్స్. శంకర్ తెరకెక్కించిన రోబో అయినా, మణిరత్నం తీసిన పొన్నియిన్ సెల్వన్ అయినా సరే అది లైకా వల్లే సాధ్యమైంది. వందల కోట్లు పెట్టి సినిమాలు నిర్మిస్తూ.. తన బ్రాండ్ వ్యాల్యూను పెంచుకుంటోంది లైకా. తలైవార్ రజినీకాంత్‌తో ఇప్పటికే పలు సినిమాలు నిర్మించేసింది. దళపతి విజయ్‌తోనూ లైకా సినిమాలు నిర్మించింది. అలా టాప్ హీరోలందరితోనూ లైకా భారీ బడ్జెట్ చిత్రాలను తీసింది లైకా.

అయితే ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2  సినిమాను కూడా లైకానే నిర్మిస్తోంది. తాజాగా లైకా ఓ ట్వీట్ వేసింది. తమ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వేసిన ఈ ట్వీట్ ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు అప్డేట్ రాబోతోందట. అది తమకు, ఆడియెన్స్‌కు ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉండబోతోందని చెప్పుకొచ్చారు. దీంతో నెటిజన్లు తమ తమ ఆలోచనలకు పదును పెట్టారు.

 

లైకా వేసిన ట్వీట్ అజిత్ నటించే 62వ సినిమా అయి ఉంటుందని, ఆ ప్రకటన గురించే ట్వీట్ వేశారని తలా అభిమానులు అంటున్నారు. ఇక ఆ ట్వీట్ రజినీ నటించబోయే 170వ సినిమా గురించే అయి ఉంటుందని తలైవార్ అభిమానులు అంటున్నారు. మధ్యలో దళపతి అభిమానులు కూడా వచ్చి చేరారు. ఇది విజయ్ సినిమా గురించి అని దళపతి అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

మరి లైకా వేసిన ఈ ట్వీట్ ఎవరి గురించి? ఏ చిత్రం గురించి? అనేది తెలియాలి. ఇప్పుడు విజయ్, అజిత్, రజినీ ఇలా అందరూ కూడా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. మరి వీరిలో రేపు రాబోయేది ఎవరి సినిమా అన్నది అభిమానులు మాత్రం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Also Read : Recce At Pawan Kalyan House : పవన్ కల్యాణ్ ఇంటి ముందు రెక్కీ.. అసలు విషయం చెప్పిన పోలీసులు

Also Read : Tabu Casting Couch : టబుకి కూడా అలాంటివి తప్పలేదట.. బర్త్ డే స్పెషల్.. నాటి వార్తలు తెరపైకి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News