Srikanth resigns: పదవులు లేకపోయినా మంచు విష్ణుకు అండగా ఉంటాం: శ్రీకాంత్

Srikanth says we will support Vishnu: అయినా అన్నేసి మాటలు అనుకున్నాకా కలిసి ఎలా పనిచేయగలమని అన్నారు శ్రీకాంత్. తమ ప్యానెల్‌లోని సభ్యులు నిన్నే రాజీనామా చేస్తానని అన్నారని శ్రీకాంత్ చెప్పారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 12, 2021, 07:03 PM IST
  • పదవులు లేకపోయినా విష్ణుకు అండగా ఉంటాం
  • అన్నేసి మాటలు అనుకున్నాకా కలిసి ఎలా పనిచేయగలం
  • హీరో శ్రీకాంత్‌ వెల్లడి
Srikanth resigns: పదవులు లేకపోయినా మంచు విష్ణుకు అండగా ఉంటాం: శ్రీకాంత్

MAA Elections 2021 Hero srikanth says we resigns but will support Manchu Vishnu: తమకు పదవులు లేకపోయినా విష్ణుకు (Manchu Vishnu) అండగా ఉంటామని హీరో శ్రీకాంత్‌ అన్నారు. మా ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పోటీ చేసి విజయం సాధించిన శ్రీకాంత్ (srikanth) రాజీనామా చేశారు. తాము మొదటి నుంచి ఎవరు ఓటు వేసినా.. ఒక ప్యానెల్‌ మొత్తానికి ఓటేయండి అని మా సభ్యులను (maa members) కోరామన్నారు. పని బాగా జరగాలంటే అలా చేయడం ముఖ్యమన్నారు. అయితే ఇప్పుడు ఆ ప్యానెల్‌లో కొంతమంది, ఈ ప్యానెల్‌లో కొంతమంది గెలిచామన్నారు. అయినా అన్నేసి మాటలు అనుకున్నాకా కలిసి ఎలా పనిచేయగలమని అన్నారు శ్రీకాంత్. తమ ప్యానెల్‌లోని సభ్యులు నిన్నే రాజీనామా చేస్తానని అన్నారని శ్రీకాంత్ చెప్పారు. తర్వాత సుదీర్ఘంగా చర్చల జరిగిన తర్వాత చివరకు రాజీనామా (resign) చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

Also Read : MAA Elections Prakash Raj panel Resigns: ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్ నుంచి గెలిచిన వారంతా రాజీనామా

గతంలో ఇలాగే కలిసి పనిచేసినప్పుడు విభేదాలు తలెత్తాయని శ్రీకాంత్‌ అన్నారు. విష్ణు (Vishnu) తనకు సోదరుడులాంటి వారని చెప్పారు. ఇక నరేశ్‌ చాలా అద్భుతంగా ఎన్నికలను నడిపించారన్నారు శ్రీకాంత్. నరేశ్ (Naresh) విష్ణు వెనుక ఉన్నప్పుడు తాము ఏదైనా అంటే మళ్లీ సమస్యలు మొదలవుతాయాని శ్రీకాంత్ చెప్పారు. పదవులు లేకపోయినా తాము మా సభ్యులందరికీ అండగా ఉంటామన్నారు. మా ఎన్నికల (MAA Elections) నేపథ్యంలో నరేశ్‌ తనని అనేక మాటలు అన్నా కూడా భరించాను అని శ్రీకాంత్‌ చెప్పారు. 

Also Read : viral Wedding Dance: అదిరిపోయిన బావ-మరదలు డ్యాన్స్..నెటిజన్లతో ఈల వేయిస్తున్న వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News