MAA Elections 2021 : నరేశ్‌ తవ్విన గుంతలో మంచు కుటుంబం పడిందన్న జీవితారాజశేఖర్‌

Jeevitha Rajasekhar coments: తాజాగా జీవిత (Jeevitha) మీడియాతో మాట్లాడారు. ఎవరికైనా.. ఎవరికైనా మద్దతు ఇవ్వొచ్చు అని చెప్పారు. ధర్మంగా, న్యాయంగా పోరాడాలి అని హితవు పలికారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 8, 2021, 08:31 PM IST
  • నరేశ్‌ తవ్విన గుంతలో మోహన్‌బాబు కుటుంబం
  • ధర్మంగా, న్యాయంగా పోరాడాలి
  • రాజీవ్‌ కనకాల, శివ బాలాజీ కాస్త మంచిగా మాట్లాడాలి
  • మీడియా సమావేశంలో జీవితారాజశేఖర్‌ వెల్లడి
MAA Elections 2021 : నరేశ్‌ తవ్విన గుంతలో మంచు కుటుంబం పడిందన్న జీవితారాజశేఖర్‌

MAA Elections 2021 Jeevitha Rajasekhar coments on Naresh: నరేశ్‌ తవ్విన గుంతలో మోహన్‌బాబు (Mohan babu) కుటుంబం పడిపోయింది అంటూ జీవితారాజశేఖర్‌ (Jeevitha Rajasekhar) కామెంట్ చేశారు. అక్టోబరు 10న జరగనున్న మా ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ (Prakash Raj) ప్యానెల్‌ నుంచి జీవిత జనరల్‌ సెక్రటరీగా పోటీ చేస్తున్నారు. తాజాగా జీవిత (Jeevitha) మీడియాతో మాట్లాడారు. ఎవరికైనా.. ఎవరికైనా మద్దతు ఇవ్వొచ్చు అని చెప్పారు. ధర్మంగా, న్యాయంగా పోరాడాలి అని హితవు పలికారు. మా అనేది మన కుటుంబం.. ఇక్కడ బెదిరింపులు, ప్రలోభాలు ఎందుకని సూచించారు జీవిత.

Also Read : Aryan Khan's bail plea: ఆర్యన్‌కి షాకిచ్చిన ముంబై కోర్టు.. బెయిల్ పిటిషన్ తిరస్కరణ

‘మా’ సభ్యులు మొత్తం దాదాపు 920 మంది ఉంటే అందులో అరవై ఏళ్లు పైబడిన వారంతా ఓటు వేసేందుకు భయపడుతున్నారని పేర్కొన్నారు జీవిత. రాజీవ్‌ కనకాల (Rajiv Kanakala), శివ బాలాజీ (siva balaji) కాస్త మంచిగా మాట్లాడాలంటూ సూచించారు ఆమె. ప్రకాశ్‌ రాజ్‌ (Prakash Raj) ‘మా’ అధ్యక్షుడు ఎందుకు కాకూడదని ప్రశ్నించారు. ప్రకాశ్‌రాజ్‌ నిజాయతీగా పని చేస్తారన్నారు. మోహన్‌బాబు (Mohan babu) కుటుంబాన్ని చూస్తుంటే తనకు జాలేస్తోందని చెప్పుకొచ్చారు ఆమె. ఇక నరేశ్‌ (Naresh) తవ్విన గుంతలో మంచు ఫ్యామిలీ పడిపోతుందన్నారు. తాను మంచి పనులు చేసేందుకు ముందుకొచ్చానని, సరదాగా తాను మా ఎన్నికల్లో (MAA Elections) పోటీ చేయడం లేదని జీవిత రాజశేఖర్‌ స్పష్టం చేశారు.

Also Read : MAA Elections 2021: ‘మా’ ఎన్నికల ప్రక్రియలో మార్పు.. తుది ఫలితాలు అప్పుడే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News