Mahesh Babu Met Bill Gates: రియల్ శ్రీమంతుడితో మహేష్ బాబు భేటీ.. కొత్త అనుమానాలు!

Mahesh Babu Met Bill Gates: ఫ్యామిలీతో సహా ప్రస్తుతం న్యూయార్క్ వెకేషన్ లో ఉన్నారు మహేష్ బాబు. తన భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి ఆయన క్వాలిటీ టైం గడుపుతున్న ఆయన తాజాగా బిల్ గేట్స్ ను కలిశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 29, 2022, 04:32 PM IST
  • వెకేషన్లో మహేష్ బాబు
  • బిల్ గేట్స్ తో దిగిన ఫోటో షేర్ చేసిన మహేష్
  • కొత్త అనుమానాలు మొదలు
 Mahesh Babu Met Bill Gates: రియల్ శ్రీమంతుడితో మహేష్ బాబు భేటీ.. కొత్త అనుమానాలు!

Mahesh Babu meet Billgates at Newyork: తన తండ్రి సినీ వారసత్వాన్ని అందుకుని సినీ రంగ ప్రవేశం చేసిన మహేష్ బాబు ప్రస్తుతం సౌత్ లో సూపర్ స్టార్ గా వెలిగిపోతున్నారు. తెలుగు తప్ప మరో సినిమాలో ఇప్పటివరకు నటించని ఆయన నిర్మాతలు వాటిని డబ్బింగ్ చేసి ఇతర భాషలలో విడుదల చేస్తున్న నేపథ్యంలో దాదాపు దక్షిణాదితోనే కాకుండా ఉత్తరాదిలో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు.. షూటింగ్ లేదంటే ఫ్యామిలీతో సమయం గడిపే ఆయన ఎక్కువగా షూటింగ్ లేకపోతే ఇతర దేశాల్లో వెకేషన్ కి వెళ్లడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో హిట్ అందుకున్న ఆయన ఫ్యామిలీతో సహా ప్రస్తుతం న్యూయార్క్ వెకేషన్ లో ఉన్నారు. తన భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి ఆయన క్వాలిటీ టైం గడుపుతున్నారు. 

అయితే ఆయన బిల్ గేట్స్ తో కలిసి ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. షేర్ చేసుకోవడమే కాక ప్రపంచం చూసిన అతి కొద్దిమంది దర్శనికులలో ఒకరు, అయినా చాలా సింపుల్ గా ఉంటూ, ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయిన బిల్ గేట్స్ ని కలిసాను అంటూ మహేష్ బాబు పేర్కొన్నారు. మహేష్ బాబు బిల్ గేట్స్ ను కలవడంతో ఆయన యాదృచ్చికంగా కలిసారా లేక ఏదైనా వ్యాపారరీత్యా కలిశారా? అనే చర్చ కూడా మొదలైంది. ఎందుకంటే మహేష్ బాబు ఒక పక్క సినీ నటుడిగా సినిమాలు చేస్తూనే మరో పక్క నిర్మాతగా సినిమాలు నిర్మిస్తున్నారు. అదేవిధంగా కొన్ని వ్యాపారాలు కూడా చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు ఆయనను కలవడానికి వెనుక ఏదైనా వ్యాపార కారణాలు ఉన్నాయా అనే అంశం మీద కూడా చర్చ జరుగుతోంది.  అయితే బిల్ గేట్స్ తాను స్థాపించిన మైక్రోసాఫ్ట్ కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. తన భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న ఆయన ప్రస్తుతం బిల్ గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తన 28వ సినిమా చేయాల్సి ఉంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద తెరకెక్కాల్సిన సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించాల్సి ఉంది. 

అయితే ఈ సినిమా ఇప్పటికే సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉండగా స్క్రిప్ట్ ఇంకా పూర్తి కాని నేపథ్యంలో అది పూర్తయ్యే వరకు సినిమా షూటింగ్ మొదలు పెట్టకూడదని మహేష్ బాబు త్రివిక్రమ్ కు సూచనలు చేసినట్లు తెలుస్తోంది ఇప్పటికే స్క్రిప్ట్ చివరి దశకు చేరుకుందని మరో వారం, పది రోజులలో భారతదేశానికి వచ్చిన మహేష్ బాబు విని గ్రీన్ సిగ్నల్ ఇస్తే వెంటనే ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఆ సినిమా పూర్తయిన వెంటనే ఆయన రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికీ ఈ సినిమా కథ పూర్తి కాలేదు కానీ మహేష్ బాబు రాజమౌళి ఇద్దరితో కలిసి ఒక సినిమా చేయడం కోసం నిర్మాత కె.ఎల్ నారాయణ ఎప్పుడో పదేళ్ళ క్రితం ఇచ్చిన అడ్వాన్స్ కారణంగా ఈ సినిమా చేసేందుకు ఈ ఇద్దరూ ముందుకు వచ్చారు.
Also Read: Suriya to Oscars committee: ఇది కదా సూర్య క్రేజ్ అంటే.. ఏకంగా ఆస్కార్స్ కమిటీలో సభ్యుడిగా!

Also Read: RRR Movie: ఆర్ఆర్ఆర్ కి మరో అరుదైన గౌరవం.. ఇండియా నుంచే ఏకైక సినిమాగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News