Sarkaru Vaari Paata Pre-release Event Updates: సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్.. వాహనదారులకు ట్రాఫిక్ అడ్వైజరీ

Sarkaru Vaari Paata Pre-release Event: మహేష్ బాబు ఫ్యాన్స్ ఎదురు చూస్తోన్న సర్కారు వారి పాట ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి ఇంకొన్ని గంటలే మిగిలి ఉంది. మే 7న.. అంటే రేపు శనివారం సాయంత్రం 6.00 గంటలకు యూసుఫ్‌గూడ 1వ TSSP బెటాలియన్  గ్రౌండ్‌లో సర్కారు వారి పాట ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనున్న సంగతి తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : May 7, 2022, 12:52 AM IST
  • మే 7న సాయంత్రం 6.00 గంటలకు సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా ట్రాఫిక్ పోలీసుల అడ్వైజరీ
  • ముందస్తు జాగ్రత్తగా పలు సూచనలు జారీ
  • వాహనాల పార్కింగ్ కోసం స్థలాల వివరాలు వెల్లడి
Sarkaru Vaari Paata Pre-release Event Updates: సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్.. వాహనదారులకు ట్రాఫిక్ అడ్వైజరీ

Sarkaru Vaari Paata Pre-release Event traffic advisory: మహేష్ బాబు ఫ్యాన్స్ ఎదురు చూస్తోన్న సర్కారు వారి పాట ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి ఇంకొన్ని గంటలే మిగిలి ఉంది. మే 7న.. అంటే రేపు శనివారం సాయంత్రం 6.00 గంటలకు యూసుఫ్‌గూడ 1వ TSSP బెటాలియన్  గ్రౌండ్‌లో సర్కారు వారి పాట ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యూసుఫ్‌గూడ బెటాలియన్ పరిసర ప్రాంతాలలో వాహనాలు అధిక సంఖ్యలో తిరిగే అవకాశం ఉన్నందున సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్నట్టు హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ విడుదల చేశారు. వాహనదారులు ట్రాఫిక్ రద్దీ కారణంగా ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తగా పలు సూచనలు జారీ చేశారు.

హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమీషనర్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం అమీర్‌పేటలోని మైత్రివనం నుండి వచ్చే బస్సులు, భారీ వాహనములు యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ వైపు అనుమతించరు. సవేరా ఫంక్షన్ హాల్ వద్ద కృష్ణకాంత్ పార్క్, కళ్యాణ్ నగర్ వైపు, సత్యసాయి నిగమాగమం, కమలాపురి కాలనీ - కృష్ణ నగర్, జూబ్లీహిల్స్ వైపు ట్రాఫిక్ మళ్లించనున్నారు.

జూబ్లీహిల్స్ నుండి వచ్చే బస్సులు, ఇతర భారీ వాహనాలు యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ వైపు అనుమతించకుండా శ్రీనగర్ కాలనీ వద్ద సత్యసాయి నిగమాగమం వైపు మళ్లించనున్నారు.

హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమీషనర్ సూచించిన వివరాల ప్రకారం ఆహ్వానితులు తమ వాహనాలను క్రింది పార్కింగ్ ప్రదేశాలలో మాత్రమే నిలపాల్సి ఉంది.

పార్కింగ్ స్థలాల పేరు                             వాహనాల రకం                                 పార్కింగ్ కెపాసిటీ
1   మహమూద్ ఫంక్షన్ ప్యాలెస్                            కార్ పార్కింగ్ కోసం మాత్రమే           70 కార్లు
2   సవేరా ఫంక్షన్ హాల్ ఎదురుగా ఓపెన్ గ్రౌండ్    4 వీలర్, 2 వీలర్ పార్కింగ్               200 కార్లు, 700 ద్విచక్ర వాహనాలు
3   ప్రభుత్వ పాఠశాల, యూసుఫ్‌గూడ                   2 వీలర్ పార్కింగ్ కోసం మాత్రమే     200 ద్విచక్ర వాహనాలు
4   యూసుఫ్‌గూడ మెట్రో స్టేషన్ పార్కింగ్            2 వీలర్ పార్కింగ్ కోసం మాత్రమే     500 ద్విచక్ర వాహనాలు

సర్కారు వారి పాట ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు (Sarkaru Vaari Paata Movie pre-release event) ఎంట్రీ పాస్‌లు ఉన్న వారు మాత్రమే ఈ ఈవెంట్‌కి హాజరు కావాలని స్పష్టంచేసిన హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమీషనర్.. ఎంట్రీ పాస్‌లలో హోలోగ్రామ్, సీరియల్ నంబర్ తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపారు. ఎంట్రీ పాస్‌లు లేని వారిని బెటాలియన్ గ్రౌండ్లోకి కూడా అనుమతించడం లేదని ట్రాఫిక్ జాయింట్ కమీషనర్ తమ ప్రకటనలో పేర్కొన్నారు.

Also read : Mouni Roy Photos: పెళ్లి తర్వాత కూడా హాట్ హాట్ పోజులు తప్పవంటున్న 'నాగిని'!

Also read : Komaram Bheemudu Song: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. 'కొమురం భీముడో' సాంగ్ వీడియో వచ్చేసింది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News