Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబాన్ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గతేడాది మహేష్ బాబు అన్నయ్య రమేశ్ బాబు అకాల మరణం చెందారు. అది మరిచిపోయే లోపు.. అమ్మ ఇందిర కూడా కాలం చేసారు. ఆ తర్వాత తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. దీంతో మహేష్ బాబు జీవితం ఓ కుదుపకు లోనైంది. ఒక యేడాదిలో ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోవడం అంటే మాములు విషయం కాదు.ఆ ఘటనలు మరవక ముందే మహేష్ బాబు ఫ్యామిలీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత .. సూపర్ స్టార్ కృష్ణ బావమరిది.. మహేష్ బాబుకు మామ అయిన ఉప్పలపాటి సూర్యనారాయణ బాబు ఆదివారం సాయంత్రం గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 74 సంవత్సరాలు.
ఉప్పలపాటి సూర్య నారాయణ బాబు విషయానికొస్తే.. పామర్రు మండలం రిమ్మనపూడి గ్రామంలో జన్మించిన ఈయన.. కృష్ణ రెండో చెల్లెలు అయిన లక్ష్మీ తులసిని పెళ్లి చేసుకున్నారు. ఈయనకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈయన పద్మావతి ఫిల్మ్స్ బ్యానర్ పై పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. కేవలం తెలుగులోనే కాకుండా.. కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 24 చిత్రాలను నిర్మించారు. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణతో కురుక్షేత్రం, మనుషులు చేసిన దొంగలు, దొంగల దోపిడి, మహేష్ బాబు, రమేశ్ బాబులతో ‘బజారు రౌడీ’ సినిమాను నిర్మించారు.
ఈయన కేవలం సినిమాలకే పరిమితం కాలేదు. రాజకీయాల్లో కూడా తన లక్ ను పరీక్షించుకున్నారు. అప్పట్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుడివాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున ఎన్టీఆర్ పై పోటీ చేసి వార్తల్లో నిలిచారు. ఆ ఎన్నికల్లో ఆయన అన్నగారిపై చిత్తుచిత్తుగా ఓడిపోయారు. ఆ తర్వాత ఈయన చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగు దేశం పార్టీలో చేరారు. రీసెంట్ గా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్ విజయానికి కృషి చేశారు. అంతకు ముందు గల్లా జయదేవ్ విజయంలో ఈయన కీ రోల్ పోషించారు.
ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..
ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter