Manju Warrier Sanal Kumar: ప్రముఖ మలయాళ సినీ దర్శకుడు సనాల్ కుమార్ శశిధరన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శశిధరన్ తనను వేధింపులకు గురిచేస్తున్నాడని నటి మంజు వారియర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొచ్చిలోని ఎలమక్కర పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. శశిధరన్ రెండేళ్లుగా తనను వేధిస్తున్నాడని, బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని... సోషల్ మీడియాలో తనపై లేని పోని పోస్టులు పెడుతున్నాడని మంజు వారియర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
శశిధరన్ తనకు మెయిల్స్, సోషల్ మీడియా, ఫోన్ ద్వారా గతంలో పలుమార్లు ప్రపోజ్ చేశాడని... స్నేహితులతోనూ ఆ విషయం చెప్పించాడని ఫిర్యాదులో మంజు వారియర్ పేర్కొన్నారు. తాను ఎన్నిసార్లు తిరస్కరించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదన్నారు.
ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడుతుండగా అరెస్ట్ :
గురువారం (మే 5) శశిధరన్ అరెస్టుకు ముందు కొద్దిపాటి హైడ్రామా చోటు చేసుకుంది. శశిధరన్ ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడుతున్న క్రమంలో అతని ఇంటికి పోలీసులు వచ్చారు. దీంతో గుర్తు తెలియని వ్యక్తులు తనను కిడ్నాప్ చేయడానికి వచ్చారంటూ శశిధరన్ వారిని ప్రతిఘటించేందుకు ప్రయత్నించాడు. తనను చంపేందుకు తీసుకెళ్తున్నారంటూ కేకలు పెట్టాడు. కొంతకాలంగా తనను ఓ మాఫియా వెంటాడుతోందని అరిచాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి శశిధరన్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు అధికారికంగా ప్రకటించారు.
సనాల్ కుమార్ శశిధరన్ మంజు వారియర్ ప్రధాన పాత్రలో కాయట్టం సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా ఇంకా విడుదల కావాల్సి ఉంది. 2020లో ఈ సినిమా బుసన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. ఈ సినిమా షూట్ జరుగుతున్నప్పటి నుంచే శశిధరన్ తనను వేధిస్తున్నట్లు మంజు వారియర్ ఆరోపిస్తున్నారు.
మంజు వారియర్ కిడ్నాప్‌కు గురైందంటూ సోషల్ మీడియాలో పోస్టులు :
ఈ నెల 1న శశిధరన్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టులో మంజు వారియర్ కిడ్నాప్‌కు గురైందని.. ఆమె లైఫ్ డేంజర్‌లో పడిందని పేర్కొన్నారు. దీని ఆధారంగా మీడియాలో కొన్ని కథనాలు కూడా వచ్చాయి. కానీ ఆ తర్వాత అందులో నిజం లేదని తేలిపోయింది. ఇదే క్రమంలో మే 4న శశిధరన్ రాష్ట్రపతి, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌లకు కూడా లేఖలు రాసినట్లు శశిధరన్ తెలిపాడు.
రాష్ట్రంలో జరుగుతున్న పలు అంశాలపై తాను గొంతెత్తుతున్నందునా తన లైఫ్ ప్రమాదంలో పడిందని అందులో పేర్కొన్నట్లు చెప్పాడు. తాను సీరియస్ విషయాల గురించి మాట్లాడితే చాలామంది జోక్‌గా తీసుకుంటున్నారని.. ఒక నటి జీవితం గురించి మాట్లాడుతుంటే కేరళలో ఏ మీడియా పట్టించుకోవట్లేదని పేర్కొన్నాడు. జాతీయ మీడియా దీన్ని సీరియస్‌గా తీసుకోవాలని కోరాడు. ఇంతలో మంజు వారియర్ అతనిపై ఫిర్యాదు చేయడంతో అరెస్టవక తప్పలేదు. కాగా, సనాల్ కుమార్ శశిధరన్ దర్శకుడిగా 'సెక్సీ దుర్గ', 'చోలా', తదితర సినిమాలను తెరకెక్కించాడు. తన సినిమాలకు గాను పలు అవార్డులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా పొందాడు.
Also Read: David Warner Century: నా కోసం అలాంటి క్రికెట్ ఆడొద్దు.. పోవెల్‌కు క్లాస్ పీకిన వార్నర్!
Also Read: భారత్‌లో కోవిడ్ మరణాలపై డబ్ల్యూహెచ్ఓ సంచలన రిపోర్ట్... మోదీపై రాహుల్ విమర్శలు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.