Covid Deaths in India: కరోనా మరణాల విషయంలో మోదీ సర్కార్‌పై విమర్శల దాడి చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్‌ను ట్విట్టర్‌లో షేర్ చేసిన రాహుల్... 'సైన్స్ అబద్దం చెప్పదు... మోదీ చెబుతారు..' అంటూ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్లుగా దేశంలో కోవిడ్ మరణాల సంఖ్య 4.7 లక్షలు కాదని... 47 లక్షలని పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారితో మృతి చెందినవారి కుటుంబాలను గౌరవించాలని... ప్రతీ కుటుంబానికి రూ.4 లక్షలు ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.
కోవిడ్ మరణాలకు సంబంధించి డబ్ల్యూహెచ్ఓ గురువారం (మే 5) ఒక రిపోర్ట్‌ను వెలువరించింది. కోవిడ్‌తో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 1, 2020 నుంచి డిసెంబర్ 31, 2021 వరకు 14.9 మిలియన్ల మంది మృతి చెందినట్లు అందులో పేర్కొన్నారు. భారత్‌లో 4.8 మిలియన్ల మంది కోవిడ్‌తో మృతి చెందినట్లు తెలిపారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం భారత్‌లో కోవిడ్ మృతుల సంఖ్య 4.7 లక్షలు మాత్రమే. డబ్ల్యూహెచ్ఓ తాజా రిపోర్టులో ఇంతకు పదింతల మరణాలు చూపించడంతో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
డబ్ల్యూహెచ్ఓ రిపోర్టును ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్, ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా ఖండించారు. కోవిడ్ మరణాలను అంచనా వేసేందుకు ఉపయోగించిన మెథడాలజీని తప్పు పట్టారు. ఇండియాలో ఉన్న సివిల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ ద్వారా క్షేత్ర స్థాయిలో కోవిడ్ మరణాలకు సంబంధించి కచ్చితమైన డేటా అందుబాటులో ఉందని... అదే డేటాను ఉపయోగించుకోవాలని డబ్ల్యూహెచ్‌ఓను కోరామని అన్నారు. కానీ దురదృష్టవశాత్తు డబ్ల్యూహెచ్ఓ ఆ డేటాకు బదులు వేరే మెథడాలజీని ఫాలో అయ్యారని అన్నారు. భారత్ పట్ల డబ్ల్యూహెచ్ఓ వ్యవహరించిన తీరు సరిగా లేదని అసహనం వ్యక్తం చేశారు.
47 lakh Indians died due to the Covid pandemic. NOT 4.8 lakh as claimed by the Govt.
Science doesn't LIE. Modi does.
Respect families who've lost loved ones. Support them with the mandated ₹4 lakh compensation. pic.twitter.com/p9y1VdVFsA
— Rahul Gandhi (@RahulGandhi) May 6, 2022
Also Read: AVAK Twitter Review: 'అశోక వనంలో అర్జుణ కల్యాణం' రివ్యూ.. ఎలా ఉందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.