RDX on OTT: ఓటీటీలోకి వచ్చేసిన మాలీవుడ్ నయా బ్లాక్ బాస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

RDX on OTT: చిన్న సినిమాగా వచ్చి సాలిడ్ హిట్ కొట్టిన చిత్రాల్లో మాలీవుడ్ మూవీ 'ఆర్‍డీఎక్స్: రాబర్ట్ డోని జేవియర్' ఒకటి. ఈ బ్లాక్ బాస్టర్ మూవీ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చి అందరినీ షాక్ కు గురిచేసింది. ఇది ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 24, 2023, 04:54 PM IST
RDX on OTT: ఓటీటీలోకి వచ్చేసిన మాలీవుడ్ నయా బ్లాక్ బాస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

RDX: Robert Dony Xavier on OTT: ఇటీవల కాలంలో మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమాలన్నీ తెలుగులో డబ్ అవుతున్నాయి. తాజాగా మరో బ్లాక్ బాస్టర్ మూవీ తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. మాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసిన సినిమా 'ఆర్‍డీఎక్స్: రాబర్ట్ డోని జేవియర్'. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ నహాస్ హిదాయత్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో షేన్ నిగమ్, ఆంటోని వర్గీస్, నీరజ్ మాధవ్ లీడ్ రోల్స్ లో నటించగా..  మహిమా నంబియార్, ఐమా సెబాస్టియ్, లాల్, బాబు ఆంటోని, మాలా పార్వతి కీలక పాత్రల్లో కనిపించారు. సోఫియా పాల్ నిర్మాతగా వ్యవహరించారు. ఎలాంటి ముందుస్తు ప్రకటన లేకుండా ఈ మూవీ ఓటీటీ ఎంట్రీ ఇచ్చేసింది. 

ఈ మూవీని ముందుగా అక్టోబరు 01న డిజిటల్ స్ట్రీమింగ్ చేయాలనుకున్నారు. కానీ సడన్ గా రిలీజైన నెల రోజులకు ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకొచ్చారు.ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫిక్స్ దక్కించుకుంది. ఈ రోజు నుంచి ఈ మూవీని నెట్‍ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం ఈ మూవీ మలయాళ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంచారు. మరికొన్ని రోజుల్లో ఈ మూవీ తెలుగు వెర్షన్ ను తీసుకురానున్నారు. రూ. 10 కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కిన ఈ సినిమాను వరల్డ్ వైడ్‍గా 900 థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 83 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది. ఈ మూవీపై మహానటి కీర్తి సురేష్, ఉదయనిధి స్టాలిన్ వంటి సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. 

Also Read: Ram Pothineni: విరాట్ కోహ్లీ బయోపిక్‍పై రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News