Manchu Vishnu Kannappa Update: మంచు విష్ణు.. హీరోగా వస్తోన్న భారీ పాన్ ఇండియా సినిమా కన్నప్ప. విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా.. ఈ సినిమా అత్యంత నిర్మాణ విలువలతో ప్రేక్షకులను ఆకట్టుకోను త్వరలో రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ.. ఈ చిత్రం మీద ఉన్న అంచనాలను భారీగా పెంచింది.
కన్నప్ప టీజర్ అన్ని భాషల ప్రేక్షకులను.. అలానే అన్ని వర్గాల ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ఇక తాజాగా విష్ణు తన కన్నప్ప సినిమాలో భాగంగా వాడిన.. విల్లు విశిష్టతను గురించి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వివరాలు తెగ వైరల్ అవుతున్నాయి.
‘కన్నప్ప’లో తిన్నడు వాడిన విల్లు.. కేవలం ఆయుధం మాత్రమే కాదు. అది ఆయన ధైర్యానికి సూచిక. అంతేకాకుండా ఆ విల్లు తండ్రీకొడుకుల మధ్య బంధానికి సూచికగా నిలుస్తుంది. ఆ బిల్లుని స్వయాన కన్నప్ప తండ్రి నాధనాథ తన చేతులతో తయారుచేయడంతో.. ఆ విల్లు వారి కుటుంబ వారసత్వంగా మారింది. ఇక ఆ విల్లుతోనే కన్నప్ప యుద్ధభూమిలో.. అసమానమైన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తారు.
ఐదు సంవత్సరాల అప్పుడే.. కన్నప్ప ఒకసారి అడవిలో క్రూరమైన పులిని ఎదుర్కొంటాడు. కన్నప్ప అంత చిన్న వయసులోనే.. సాధారణ కర్రతో పోరాటం చేసి ఆ పులి నుంచి తప్పించకుంటాడు. ఇక తన కొడుకు ధైర్య సాహసాల్ని చూసి నాధనాథుడు మురిసిపోతాడు. అందుకే కన్నప్ప శౌర్యానికి ప్రతీకగా ప్రత్యేకమైన.. విల్లును తయారు చేస్తాడు. ఈ విల్లులో ప్రత్యేకత ఏమిటి అంటే.. ఈ విల్లుని.. పులి దంతాలు, ఎముకలతో చేస్తారు. అందుకే ఈ విల్లు ధైర్య సాహసాలకి ప్రతీకగా నిలుస్తుంది.
అంతేకాకుండా ఈ విల్లుని రెండుగా విరిస్తే.. యుద్దంలో పోరాడేందుకు కత్తుల్లానూ కూడా ఉపయోగపడేలా దాన్ని తీర్చిదిద్దుతారు. ఇక ఈ బిల్లు గురించి..విష్ణు చెప్పిన కథను శ్రద్దగా విన్న న్యూజిలాండ్‌లోని చిత్ర కళా దర్శకుడు క్రిస్.. ప్రత్యేకమైన విల్లుని ఈ సినిమా కోసం తయారు చేశారు.
విష్ణు అంచనాలకు తగ్గట్టుగా..కన్నప్ప సినిమా విజన్‌కు అనుగుణంగా అతను ఈ విల్లును రూపొందించాడు. ఈ విల్లుతోనే.. ఈ సినిమాలో కొంత భాగాన్ని.. న్యూజిలాండ్‌లో రెండు నెలల పాటు చిత్రీకరించారు.
ఇక ఇదే విషయం గురించి..విష్ణు మంచు మాట్లాడుతూ..’ఈ తిన్నడు విల్లు కన్నప్పలో అంతర్భాగం అయింది. అతను దాన్ని ఎంతో గర్వంతో ఉపయోగిస్తూ.. తన తెగను, అడవిలో సమతుల్యతను కాపాడుకుంటాడు. ఈ కన్నప్ప కథ యువతలో ధైర్యాన్ని నింపుతుంది. అందుకే.. మేము అనుకున్నదాన్ని అనుకున్నట్టుగా రూపొందించినందుకు సంతోషంగా ఉంది’ అని అన్నారు.
Also Read: DSC Exams: డీఎస్సీ అభ్యర్థులకు భారీ షాక్.. పాలమూరులో రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter