Meenakshi Chaudhary: ‘మట్కా’ సినిమా తన కెరీర్ లో డిఫరెంట్ మూవీ.. హీరోయిన్ మీనాక్షి చౌదరి..

Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి తెలుగులో చిన్న చిన్నగా మొదలుపెట్టి వరుస సినిమాలతో అలరిస్తోంది. ఓ మోస్తరు హీరోల పాలిట ఈమె లక్కీ గర్ల్ గా మారింది. రీసెంట్ గా ‘లక్కీ భాస్కర్’తో మంచి హిట్ అందుకుంది. తాజాగా వరుణ్ తేజ్ ‘మట్కా’ మూవీతో పలకరించబోతుంది. ఈ సినిమాపై తనలో క్యారెక్టర్ గురించి చెప్పుకొచ్చింది.  '  

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 14, 2024, 06:30 AM IST
Meenakshi Chaudhary: ‘మట్కా’ సినిమా తన కెరీర్ లో డిఫరెంట్ మూవీ.. హీరోయిన్ మీనాక్షి చౌదరి..

Meenakshi Chaudhary: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మట్కా’. ఈ గురువారం విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన  ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి  నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి కథానాయికలుగా యాక్ట్ చేశారు.  ఈ మూవీ టీజర్, ట్రైలర్ తో అంచనాలు భారీగా పెరిగాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా కథానాయిక మీనాక్షి చౌదరి ఈ సినిమా గురించి తన మనసులో మాట పంచుకుంది.  

దీపావళికి లక్కీ భాస్కర్ తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. తాజాగా ఇప్పుడు మట్కాతో పలకరిస్తున్నారు? ఎలా అనిపిస్తోంది?
చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రతి నటి కల గనే పాత్ర. లక్కీ భాస్కర్ మంచి విజయం అందుకుంది. ఇప్పుడు మట్కా వస్తుంది. ఇదే నెలలో మెకానిక్ రాకీ సినిమా విడుదల కాబోతుంది. ఒకే నెల గ్యాప్ లో  మూడు సినిమాలు రావడం నటిగా  నాకు చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం. ఇది నాకు స్పెషల్ మూమెంట్. మట్కా రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నాను

మట్కాలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది ?
మట్కా చిత్రంలో సుజాత పాత్రలో కనిపించబోతున్నాను. సుజాత వాసు లవ్ ఇంట్రెస్ట్. నా పాత్ర మూడు డిఫరెంట్ ఫేజుల్లో ఉంటుంది. వాసు క్యారెక్టర్ తో పాటు ప్రయాణమయ్యే పాత్ర. ఒక జీవిత ప్రయాణం ఉంటుంది.  

-సుజాత వెరీ పాజిటివ్ క్యారెక్టర్. వాసు లైఫ్ లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సుజాత పాత్రలో ఒక ఇన్నోసెన్స్ ఉంది.వాసు జీవితంలో ఒక వెలుగులు పంచే క్యారెక్టర్. అందరూ రిలేట్ చేసుకునేలా నా పాత్ర ఉంటుంది.  

ఇది ఒక వ్యక్తి ప్రయాణం కదా.. మేకోవర్ ఛాలెంజింగ్ గా అనిపించిందా?
- చాలా ఎక్సైటింగ్ ట్రాన్స్ఫర్మేషన్ వుంది. ఇందులో ఒక పాత కాలపు లుక్ ఉంటుంది. టీనేజ్ లో ఒకలా కనిపిస్తుంది. లైఫ్ లో దశలు మారుతున్న కొద్దీ ఆ లుక్ మారడం నాకు కూడా కొత్తగా కనిపించింది. డైరెక్టర్ లుక్కు విషయంలో చాలా పర్టికులర్.  ఆయన చాలా పర్టికులర్ గా స్కెచెస్ వేసి ఈ పాత్ర  లుక్ ని డిజైన్ చేశారు. మేకప్, హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్ అన్ని విషయాల్లో చాలా శ్రద్ధ తీసుకున్నారు. రియల్లీ ఇది చాలా మరిచిపోని ఎక్స్పీరియన్స్.  

సుజాత పాత్ర చేయడం మీకు ఛాలెంజింగ్ గా అనిపించిందా?
డెఫినెట్ గా ఈ పాత్ర చేయడంలో ఒక ఛాలెంజెస్ వున్నాయి. ఇది ఒక పీరియడ్ డ్రామా. మోడ్రన్ టైమ్స్ తో పోల్చుకుంటే పీరియడ్ టైం లో బాడీ లాంగ్వేజ్ సరికొత్తగా  ఉంటుంది. అది అచీవ్ చేయడానికి కచ్చితంగా హోంవర్క్ చేయాలి. అది నేను చేశాను. అది చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఇప్పటి వరకు నేను చేసిన పాత్రలో చాలా డిఫరెంట్ లుక్ ఉన్న సినిమా ఏది. డెఫినెట్ గా చాలా కొత్త ఎక్స్పీరియన్స్. చాలా ఎంజాయ్ చేశాను.

వరుణ్ తేజ్ తో మీ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ గురించి?
-వరుణ్ తేజ్ తో పని చేయడం  గొప్ప ఎక్స్ పీరియన్స్. వరుణ్ వండర్ఫుల్ పర్సన్. సెట్ లో చాలా హెల్ప్ ఫుల్ గా వుంటారు. ఆయనకి సినిమా గురించి పెద్ద నాలెడ్జ్  ఉంది. వాసు పాత్రలో వరుణ్ తేజ్ అద్భుతంగా ఒదిగిపోయారు. చాలా హార్డ్ వర్క్ చేశారు.

వరుణ్ తేజ్  కాంబినేషన్లో ఒక పాట ఉంది. అది లవ్ సాంగ్. ఒక లైఫ్ స్టోరీ ఇలా ఉంటుంది. ఆ పాటని దర్శకుడు  చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. ఈ సినిమా కోసం అందరూ 100% ఎఫర్ట్ పెట్టారు. తప్పకుండా సినిమా గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది.

మట్కా నిర్మాతల గురించి?
ప్రొడ్యూసర్స్  చాలా ప్యాషన్ తో ఈ సినిమా నిర్మించారు. వారి నిర్మాణంలో పనిచేయడం వండర్ఫుల్ ఎక్స్ పీరియన్స్

ఎలాంటి జోనర్స్  చేయడం ఇష్టం ?
ఒక  జోనర్స్ మాత్రమే కాదు. అన్ని  ఇష్టమే. కథ బాగుంటే అన్ని రకాల పాత్రలు చేయాలనుంది. ప్రస్తుతం 'సంక్రాంతికి వస్తున్నాం' షూటింగ్ లో ఉన్నాను.

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News