Mohan Babu: తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో అవ్వాలి అంటే ఒకప్పుడు ఎంతో కష్టం. పర్సనాలిటీ ఉన్నా.. డైలాగులు గడగడా చెప్పగలిగినా.. అదృష్టం కలిసి రావడానికి చాలా టైం పట్టేది. మోహన్ బాబు కూడా ఎంతో కష్టపడి కింద లెవెల్ నుంచి మెల్లిగా హీరోగా మారారు. మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా అడుగుపెట్టి ఆ తరువాత విలన్ గా ,కమీడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ,హీరోగా అంచలంచలుగా ఎదుగుతూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి మోహన్ బాబుకి కలెక్షన్ కింగ్ అనే ఓ బిరుదు ఉంది. ఈ బిరుదు వెనక ఓ పెద్ద స్టోరీ కూడా ఉంది.. మరి ఈరోజు మోహన్ బాబు తన 72వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందామా.
1975లో వచ్చిన స్వర్గం నరకం చిత్రం తో మోహన్ బాబు కి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చింది. ఈ మూవీ తర్వాత భక్తవత్సలం నాయుడు అనే పేరుని స్క్రీన్ మీద మోహన్ బాబు గా మార్చారు. ఆ తర్వాత హీరోగా, కామెడీ - విలన్ గా తన విలక్షణమైన నటనతో మోహన్ బాబు బాగా పాపులర్ అయ్యారు. మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్ వద్ద తిరుగులేని రికార్డులు సృష్టించింది. ఈ మూవీ తర్వాత మోహన్ బాబు ఖాతాలో కలెక్షన్ కింగ్ అనే టైటిల్ చేరింది. టైటిల్ కి తగ్గట్టుగానే ఆ తర్వాత పలు చిత్రాలలో మోహన్ బాబు మూవీస్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ వసూలు చేశాయి.
1991లో విడుదలైన యాక్షన్ రొమాంటిక్ కామెడీ మూవీ అసెంబ్లీ రౌడీ. దివ్యభారతి హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి బి. గోపాల్ దర్శకత్వ బాధ్యతలు వహించారు. సత్యరాజ్ హీరోగా నటించిన వేలై కిడైచూడుచు అనే తమిళ్ మూవీ కి ఈ చిత్రం రీమిక్. పాలిటిక్స్ గురించి ఈ చిత్రంలో పరుచూరి బ్రదర్స్ రాసిన సెటైరికల్ డైలాగ్స్ ఓ రేంజ్ లో ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఈ మూవీ తర్వాత బి గోపాల్ దర్శకత్వంలో మోహన్ బాబు నటించిన నాలుగు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. అప్పట్లో వీళ్ళ కాంబినేషన్ సూపర్ హిట్ గా నిలిచింది.పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్ కి ఈ మూవీ నాంది పలికింది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఏ పాత్రలో అయినా ఇట్టే వదిలి పోగలిగే నటుడు మోహన్ బాబు.. అందుకే అతనికి నట ప్రపూర్ణ అన్న బిరుదు కూడా ఉంది.
Also Read: TamiliSai: "బాధగా ఉంది.. కానీ తప్పడం లేదు": రాజ్‌భవన్ ఖాళీ చేసిన తమిళిసై
Also Read: Kavitha: కవిత అరెస్ట్‌పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు.. ఘాటెక్కిన రాజకీయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook