Viswam Movie: మాచోస్టార్ గోపీచంద్ ప్రమోషన్స్ షూరు.. దసరా బరిలో 'విశ్వం'

Gopichand Viswam Updates: దసరా సందర్భంగా విశ్వం మూవీతో ఆడియన్స్‌ ముందుకురానున్నాడు మాచో స్టార్ గోపీచంద్. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 11న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ మూవీ నుంచి తాజాగా రెండో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Sep 25, 2024, 01:38 PM IST
Viswam Movie: మాచోస్టార్ గోపీచంద్ ప్రమోషన్స్ షూరు.. దసరా బరిలో 'విశ్వం'

Gopichand Viswam Updates: మాచో స్టార్ గోపీచంద్ ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. ప్రతి సినిమాలో డిఫరెంట్ రోల్స్ పోషిస్తున్న గోపీచంద్.. ఈసారి శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ సరికొత్త మూవీ చేశారు. ఈ చిత్రానికి విశ్వం అనే టైటిల్‌ను ఖరారు చేయగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దసరా కానుకగా అక్టోబర్ 11న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్ షూరు చేశారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ 'మొరాకో మగువా'కు మంచి స్పందన రాగా.. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Also Read: Devara: ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఎన్టీఆర్ దేవర రచ్చ.. ఫస్ట్ డే ఆ హీరోల రికార్డ్స్ ఫసక్..
 
‘మొండి తల్లి పిల్ల నువ్వు’ అంటూ ఈ సాంగ్‌లో మదర్ ఎమోషన్‌ను చేతన్ భరద్వాజ్ అద్భుతంగా ప్రజెంట్ చేశారు. హార్ట్ టచ్చింగ్‌గా ఈ సాంగ్‌ని కంపోజ్ చేయడంతో వినసొంపుగా ఉంది. శ్రీ హర్ష ఈమని రాసిన లిరిక్స్ మనసుని హత్తుకునేలా ఉన్నాయి. లవ్లీ వోకల్స్‌తో సాహితీ చాగంటి కట్టిపడేశారు. మదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఈ సాంగ్‌తో స్టోరీలోని ఎమోషనల్ డెప్త్‌ను అర్థం చేసుకోవచ్చు. ఈ సాంగ్‌లో పాపతో హీరో గోపిచంద్‌కు ఉన్న బాండింగ్‌ను రీవిల్ చేయలేదు. అయితే ఎమోషన్స్‌తో మరింత క్యురియాసిటీని పెంచారు మేకర్స్. 

విశ్వం మూవీకి గుహన్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నరు. శ్రీనువైట్ల పలు బ్లాక్‌బస్టర్స్‌ సినిమాలతో అనుబంధం ఉన్న గోపీ మోహన్ ఈ మూవీకి స్క్రీన్‌ప్లే రాశారు. ఎడిటర్‌గా అమర్‌రెడ్డి కుడుముల వర్క్ చేయగా.. ఆర్ట్‌ డైరెక్టర్‌గా కిరణ్‌ మన్నె వ్యవహరించారు. అక్టోబర్ 11న సినిమా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 

ఈ ఏడాది భీమా మూవీతో గోపీచంద్ ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అయితే ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇక శ్రీను వైట్ల చివరగా రవితేజ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలోనే గోపీచంద్-శ్రీను వైట్ల కాంబో విశ్వం మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్నారు. అందుకే ముందు నుంచే భారీగా ప్రమోషన్స్‌ చేస్తున్నారు. సాంగ్స్, టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తుండడంతో హిట్‌పై మేకర్స్ ధీమాగా ఉన్నారు. 

ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News