Varudu Kaavalenu: దసరా బరిలో వరుడు కావలెను... రిలీజ్ డేట్ ఫిక్స్

Naga Shaurya's Varudu Kaavalenu: దసరా బరిలో వరుడు కావలెను మూవీ దిగుతోంది. అలాగే ఈసారి నాలుగైదు సినిమాలు ద‌స‌రా బ‌రిలో నిలిచాయి. అక్టోబర్ 1న సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) రిపబ్లిక్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 25, 2021, 05:14 PM IST
  • దసరా బరిలో దిగనున్న వరుడు కావలెను మూవీ
  • ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, టీజర్లకు మంచి రెస్పాన్స్
  • నాగ శౌర్య మంచి హిట్ కొడ‌తాడ‌ని టాక్
Varudu Kaavalenu: దసరా బరిలో వరుడు కావలెను... రిలీజ్ డేట్ ఫిక్స్

Naga Shaurya's Varudu Kaavalenu Makes A Surprise Entry For Dussehra : టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య, పెళ్లి చూపులు ఫేమ్ రీతువర్మ జంటగా నటించిన చిత్రం వరుడు కావలెను (Varudu Kaavalenu). ఈ మూవీతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతోంది. టాలీవుడ్‌కు (Tollywood) సంక్రాంతి, సమ్మర్ సీజన్‌ల తరహాలో దసరా సీజన్ కూడా ఎంతో ముఖ్యమైనదే.

దసరా బరిలో వరుడు కావలెను

దసరా బరిలో వరుడు కావలెను మూవీ దిగుతోంది. అలాగే ఈసారి నాలుగైదు సినిమాలు ద‌స‌రా బ‌రిలో నిలిచాయి. అక్టోబర్ 1న సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) రిపబ్లిక్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 8న వైష్ణవ్ తేజ్ కొండపొలం, అదేరోజున అఖిల్ అక్కినేని నటించిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాలు విడుదలవుతున్నాయి.

Also Read : AP Government: ఏపీవో భారీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తి సంస్థ పరిశ్రమ త్వరలో ఏర్పాటు

నాగ శౌర్యకు హిట్‌ వస్తుందని టాక్

మరోవైపు అక్టోబర్ 14న అజయ్ భూపతి.. మహాసముద్రం విడుదల కానుంది. తాజాగా ఈ లిస్ట్‌లోకి నాగ‌శౌర్య మూవీ వచ్చి చేరింది. ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 15న వరుడు కావలెను ( (Varudu Kaavalenu) మూవీ రిలీజ్‌కానుంది. ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, టీజర్ అన్నీ ఇప్పటికీ ప్రేక్షకుల ఆదరణ పొందాయి.

 

డీవీ ప్రసాద్‌ సమర్పిస్తున్న వరుడు కావలెను మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో నాగ శౌర్య (naga shourya) మంచి హిట్ కొడ‌తాడ‌ని భావిస్తున్నారు. మొత్తానికి ఈ దసరా సీజన్‌కు బాక్సాఫీస్ కళకళలాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌, టీజర్‌ వరుడు కావలెను మూవీపై పాజిటివ్‌ బజ్‌ను క్రియేట్‌ చేశాయి.

 

Also Read : Love Story Movie : సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్న లవ్‌స్టోరి మూవీ.. ఒక్కరోజులోనే అన్ని కోట్లు వసూలు చేసిందట 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News