Rajamouli -Mahesh Babu: మహేష్ కోసం రాజమౌళి స్కెచ్.. నాగార్జునతో పాటు మరో బాలీవుడ్ స్టార్ హీరో.. ?

SSMB29: బాహుబలి మూవీ తర్వాత రాజమౌళి సినిమాలకు మార్కెట్ వాల్యూ విపరీతంగా పెరిగింది. ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ తో రాజమౌళి ఏ హీరోతో సినిమా చేస్తాడు అనే విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు ప్రాజెక్టుతో బిజీగా ఉన్న రాజమౌళి ఆ సినిమాలో నాగార్జునతో తో పాటు ఒక బాలీవుడ్ హీరో తీసుకోబోతున్నారని వార్త వైరల్ అవుతుంది. మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 9, 2024, 04:30 PM IST
Rajamouli -Mahesh Babu: మహేష్ కోసం రాజమౌళి స్కెచ్.. నాగార్జునతో పాటు మరో బాలీవుడ్ స్టార్ హీరో.. ?

Nagarjuna: టాలీవుడ్ సినిమాల స్థాయి పెంచిన దర్శక ధీరుడు రాజమౌళి. ఒక్క సినిమా తీయడానికి సంవత్సరాలు తీసుకున్న.. తన రికార్డు బ్రేక్ చేయడానికి మిగిలిన సినిమాలకు సంవత్సరాలు పట్టేతంట ఇంపాక్ట్ ఇస్తాడు. అందుకే స్టార్ హీరోలు సైతం ఇతనితో సినిమా చేయడానికి సై అంటున్నారు. ప్రస్తుతం గుంటూరు కారం చిత్రం తర్వాత మహేష్ రాజమౌళి కాంబోలో మూవీ తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే.

ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జోరుగా సాగుతున్నాయి. పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ తలపించే విధంగా.. ఇంటర్నేషనల్ లెవెల్ లో రాజమౌళి ఈ చిత్రాన్ని తీయబోతున్నారు అని టాక్. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన జానర్ పై పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది ఇది ఒక ఇంటర్నేషనల్ స్పై మూవీ అని అంటుంటే మరి కొంతమంది ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో సాగే చిత్రమని అంటున్నారు. ఇలా మూవీకి సంబంధించి పలు రకాల కథనాలు వినిపిస్తున్న రాజమౌళి మాత్రం ఇంకా దీనిపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. 

రాజమౌళి ప్లానింగ్ వేరే లెవెల్ లో ఉంటుంది అనే విషయం మనకు తెలిసిందే. ఇక రాజమౌళి తమ సినిమాలో పాత్రల విషయానికి వస్తే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా.. అవసరమైతే బయట భాషల నుంచి టాప్ యాక్టర్స్ ని దింపేస్తాడు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు తో పాటు ఈ మూవీలో తెలుగు హీరోలు ఎవరైనా ఉన్నారా? ఉంటే అది ఎవరు? అన్న పాయింట్ పై తెగ డిస్కషన్ జరుగుతుంది.

ఈ నేపథ్యంలో ఈ మూవీలో టాలీవుడ్ మన్మధుడు నాగార్జునను కూడా ఓ కీలకమైన పాత్ర కోసం తీసుకోవాలి అని రాజమౌళి ఆలోచిస్తున్నట్టు వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. నాగార్జున నటించిన రాజన్న చిత్రం కోసం అప్పట్లో రాజమౌళి కొంత వర్క్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ మూవీకి డైరెక్టర్ గా వ్యవహరించింది.. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. అందుకే నాగార్జునకు రాజమౌళితో మంచి అనుబంధం ఉంది. మరోపక్క మహేష్ రాజమౌళి మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్న కేఎల్ నారాయణ తో కూడా నాగుకు సత్సంబంధాలు ఉన్నాయి. ఇక ఇవన్నీ పక్కన పెడితే బ్రహ్మాస్త్రం మూవీ వల్ల నాగార్జునకు నేషనల్ వైడ్ గుర్తింపు ఉంది. అందువల్ల రాజమౌళి తన సినిమాలో ఓ కీలక పాత్ర కోసం నాగార్జునను తీసుకుని అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్న గాసిప్ నడుస్తోంది. 

అయితే నాగార్జున మాత్రమే కాదు ఈ సినిమాలో మరో బాలీవుడ్ నటుడిని కూడా రాజమౌళి తీసుకుంటున్నారట. రణబీర్ కపూర్ లేదా రణధీర్ కపూర్ ని ఆ పాత్ర కోసం రాజమౌళి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. రాజమౌళికి అన్ని భాషలలో పాపులారిటీ ఉంది.. అందుకే బాలీవుడ్ లో సైతం మహేష్ బాబు సినిమా ఓపెనింగ్స్ భారీగా రావడానికి ఇలా బాలీవుడ్ హీరోలని తన చిత్రంలో పెట్టుకొని ఉన్నారని తెలుస్తోంది. అయితే అధికారికంగా ప్రకటన వచ్చాకే ఈ విషయంపై పూర్తిస్థాయి స్పష్టత వస్తుంది.

Also Read: Eagle Twitter Review: ఈగల్ ట్విట్టర్ రివ్యూ.. బాక్సాఫీస్‌పై మాస్ మహారాజా దాడి

Also Read: YSRCP MP Candidates: వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు వీరే.. మూడో స్థానానికి కూడా పోటీతో ఎన్నికలు రసవత్తరం

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x