ఈవెంట్‌లో లైవ్ స్టంట్ చేసిన బాలయ్య

           

Last Updated : Oct 15, 2017, 08:01 PM IST
ఈవెంట్‌లో లైవ్ స్టంట్ చేసిన బాలయ్య

చెన్నైలో జరిగిన స్టంట్‌ ఆర్టిస్ట్స్‌ యూనియన్‌ 50వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు రజనీకాంత్, సూర్య, ధనుష్, విశాల్, మోహన్ లాల్ లాంటి చలనచిత్ర ప్రముఖులందరూ విచ్చేయగా.. అదే ఫంక్షనులో ఒక విచిత్రం చోటుచేసుకుంది. అదే కార్యక్రమానికి తెలుగు పరిశ్రమ నుండి విచ్చేసిన నందమూరి బాలకృష్ణ, నిర్వాహకుల కోరిక మీదకు అక్కడిక్కడే ఒక స్టంట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. స్టంట్ మెన్స్‌‌తో సరదాగా స్టేజ్‌పైనే ఒక ఫైట్ సీక్వెన్స్ చేసి అందరి చప్పట్ల మధ్య కితాబునందుకున్నారు. ప్రేక్షకుల విజిల్స్ మధ్య తొడ కూడా కొట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇది జరిగి రెండు నెలలు అవుతున్నా, ఆ వీడియో బయటకు రావడంతో ఇప్పుడు అది బాగా పాపులరైంది. 

Trending News