Nandamuri Chaitanya Krishna Breathe Movie: మరో నందమూరి హీరో ఎంట్రీ.. బ్రీత్ అంటూ వచ్చేస్తున్నాడు!

Breathe Movie First Look: బ్రీత్ అనే సినిమాతో నందమూరి జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ హీరోగా లాంచ్  అవుతున్నాడు, ఆ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 5, 2023, 06:29 PM IST
Nandamuri Chaitanya Krishna Breathe Movie: మరో నందమూరి హీరో ఎంట్రీ.. బ్రీత్ అంటూ వచ్చేస్తున్నాడు!

Nandamuri Chaitanya Krishna Breathe Movie First Look: నందమూరి అభిమానులు అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్నా మోక్షజ్ఞ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అనే విషయం మీద క్లారిటీ లేదు. అయితే అనుకోకుండా నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. బ్రీత్ అనే సినిమాతో నందమూరి జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ హీరోగా లాంచ్  అవుతున్నాడు.

2003లోనే ఆయన ధమ్ అనే సినిమా చేశాడు కానీ అది విడుదలయింది అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. ఈ క్రమంలో ఇదే ఆయన ఎంట్రీ అన్నట్టుగా నందమూరి ఫాన్స్ చెబుతున్నారు. ఇక ఆదివారం నాడు ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆయన సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ రిలీజ్ చేశారు. ధమ్ సినిమాలో నందమూరి చైతన్యకృష్ణ కనిపించాడు కానీ అది వర్కౌట్ కాకపోవడంతో బ్రీత్ సినిమాతో ఆయన హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటున్నారు.

ఇక బ్రీత్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లో వర్షంలో గొడుగు పట్టుకుని సీరియస్ లుక్ లో చైతన్య కృష్ణ కనిపిస్తున్నాడు. ఇక బ్రీత్ అనే పదంతో పాటు దాని కింద అంతిమ పోరాటం క్యాప్షన్ ఇవ్వడం ఈ సినిమా మీద ఫస్ట్ లుక్ మీద ఆసక్తి పెంచేస్తోంది. వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దివంగత ఎన్టీఆర్ మొదటి కుమారుడు నందమూరి జయకృష్ణ నిర్మిస్తున్నారు.

తన కుమారుడు చైతన్య కృష్ణను హీరోగా నిలబెట్టడం కోసమే జయకృష్ణ స్వయంగా బసవతారకం క్రియేషన్స్ అనే ఒక బ్యానర్ ఏర్పాటు చేసి ఈ బ్రీత్ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కనుక మనం పరిశీలించినట్లయితే ఇదొక సీరియస్ సోషల్ కాజ్ మీద ఉన్న సినిమాగా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాకి మార్క్ కే రాబిన్ సంగీతం అందిస్తూ ఉండగా బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు. 

Also Read: Bahubali2 Record Break: హిందీ సహా అన్ని బాషలలో బాహుబలి 2 రికార్డులు బద్దలు కొట్టడానికి ఎన్ని రోజులు పట్టిందంటే?

Also Read: Manchu Manoj Tributes: అత్తా మామలకు మంచు మనోజ్ నివాళులు..భార్యతో కలిసి భారీ కాన్వాయ్లో వెళ్లి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 
 

Trending News