Nandamuri Fans: నందమూరి ఫాన్స్ కు గుడ్ న్యూస్.. వారసుడు పని మొదలెట్టేశాడు!

Nandamuri Mokshagna Teja  Weight Loss: నందమూరి వారసుడు మోక్షజ్ఞ తేజ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది, అందులో భాగంగానే ఆయన వెయిట్ లాస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 6, 2022, 02:48 PM IST
Nandamuri Fans: నందమూరి ఫాన్స్ కు గుడ్ న్యూస్.. వారసుడు పని మొదలెట్టేశాడు!

Nandamuri Mokshagna Teja Taking Ayurveda Treatment for Weight Loss: నందమూరి ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్, అదేమిటి అనుకుంటున్నారా, నందమూరి ఫ్యాన్స్ అంతా ఎంతో కాలం ఎదురు చూస్తున్న నందమూరి మోక్షజ్ఞ తేజ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆయనను వచ్చే ఏడాది ఒక అద్భుతమైన ప్రాజెక్టు ద్వారా లాంచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే మోక్షజ్ఞ తేజ అడపాదడపా పలు సందర్భాల్లో మీడియా కంట పడుతూనే ఉన్నాడు. తాజాగా బాలకృష్ణతో కలిసి హిట్ 2 సినిమా చూసి ఫోటోలకు కూడా ఫోజులిచ్చారు. ఇక ఇప్పుడు  తాజాగా అందుతున్న సమాచారం మేరకు నందమూరి మోక్షజ్ఞ తేజ బరువు తగ్గి పూర్తిస్థాయిలో హీరోలా ఫిజిక్ తెచ్చుకునేందుకు ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పక్కనే ఉన్న యాడ్ లైఫ్ అనే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ సెంటర్లో ఆయన బరువు తగ్గేందుకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఆయుర్వేద పంచకర్మ వంటి ట్రెడిషనల్ కేరళ ఆయుర్వేద ట్రీట్మెంట్ ఇస్తారు. ఏరోబిక్స్, జిమ్, యోగ, నాచురోపతి, ఆయుర్వేదం ట్రీట్మెంట్ కూడా ఈ కేంద్రంలోని అందిస్తున్నారు.

తాజాగా మోక్షజ్ఞ తేజ అక్కడ నుంచి కారులో ఇంటికి బయలు దేరుతున్న ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇక నందమూరి మోక్షజ్ఞ తేజను నందమూరి బాలకృష్ణ డైరెక్షన్ లో లాంచ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ తన డైరెక్షన్లో ఆదిత్య త్రి 999 మ్యాక్స్ అనే సినిమా చేయబోతున్నట్లుగా ప్రకటించారు. బహుశా ఆ సినిమా ద్వారానే నందమూరి మోక్షజ్ఞ తేజ హీరోగా లంచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికొస్తే ఆయన ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. వీర సింహారెడ్డి పేరు ఎక్కుతున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ కి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కన్నవారి 12వ తేదీన ఘనంగా ఈ సినిమా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేయాల్సి ఉంది.

Also Read: Pension Rules: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. పెన్షన్ నిబంధనల్లో కీలక మార్పులు  

Also Read: Chandramohan: చిరంజీవి అర్జునుడైతే, అల్లు అరవింద్‌ శ్రీకృష్ణుడు..చంద్రమోహన్ షాకింగ్ కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 
 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x