Chandramohan Sensational Comments on Chiranjeevi and Allu Aravind: మెగాస్టార్ చిరంజీవి మీద నటుడు చంద్రమోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నారు. తాను మాత్రమే కాక తన కుటుంబం నుంచి అనేక మంది హీరోలను ఇంటర్ ఇప్పించి సినీ పరిశ్రమలో నిలదొక్కునేలా చేసుకున్నారు.
అలాంటి మెగాస్టార్ చిరంజీవి మీద ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రమోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు అల్లు అరవింద్ అనే వ్యక్తి లేకపోతే చిరంజీవి లేనే లేడంటూ ఆయన కామెంట్ చేశారు. అర్జునుడిని, శ్రీకృష్ణుని కురుక్షేత్రంలో ఎలా గైడ్ చేశాడో చిరంజీవిని అల్లు అరవింద్ అలా గైడ్ చేశాడని పేర్కొన్నారు. శ్రీకృష్ణుని సారధిగా లేకపోతే అక్కడ కురుక్షేత్రంలో అర్జునుడు నథింగ్ అని చిరంజీవికి అల్లు అరవింద్ సారధిగా లేకపోతే ఆయన కూడా నథింగ్ అంటూ కూడా అర్థం వచ్చే విధంగా ఆయన మాట్లాడారు.
చిరంజీవికి గైడెన్స్ అల్లు అరవింద్ ఇచ్చే వారిని ఏ క్యారెక్టర్స్ వేయాలి ఎంత తీసుకోవాలి అనే విషయాలు కూడా అన్ని అంటూ అరవింద చూసుకునే వారని ఈ సందర్భంగా చంద్రమోహన్ పేర్కొన్నారు. మా రోజుల్లో చిరంజీవిని మహాభారతంలో అర్జునుడుగా సంభోదించే వాళ్ళమని అర్జునుడు ఒక మిషన్ కోసం బయలుదేరినప్పుడు అతను ఎప్పుడూ శ్రీకృష్ణుడు వైపు చూసేవాడని శ్రీకృష్ణుడు సూచనల మేరకు ముందుకు వెళ్లేవాడని చెప్పుకొచ్చారు.
అలాగే అర్జునుడు చిరంజీవి అయితే శ్రీకృష్ణుడు అల్లు అరవింద్ అని చెప్పుకొచ్చారు. ఒక సినిమా అంగీకరించే సమయంలో అది ఏ ప్రొడక్షన్ హౌస్ తో చేయాలి? ఎంత అమౌంట్ రెమ్యూనరేషన్ తీసుకోవాలి? ఎలాంటి పాత్రలు ఎంచుకోవాలి? అనే విషయాలన్నీ అల్లు అరవింద్ నుంచే సలహాలుగా మెగాస్టార్ చిరంజీవి తీసుకునే వారని చెప్పుకొచ్చారు. అల్లు అరవింద్ సహకారం వల్లే చిరంజీవి ఇంతగా స్టార్ హీరో అయ్యారని ఉన్నత స్థాయికి చేరుకున్నారని చంద్రమోహన్ పరోక్షంగా కామెంట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Also Read: IT Raids : దేవినేని, వల్లభనేని ఇళ్లపై ఐటీ రైడ్స్.. హైదరాబాద్ లో కూడా!
Also Read: Allu Aravind: అలా నలుగురి చేతుల్లోకి థియేటర్లు.. లోగుట్టు బయటపెట్టిన అల్లు అరవింద్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook